నిజామాబాద్, డిసెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అనేది శుభ సూచకం అని, అదే విధంగా జిల్లాలో జరిగిన విజయాలను, అపజయాలను స్వీకరిస్తూ మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో ప్రజా సంక్షేమమే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు.
అదేవిధంగా జిల్లాలో బిఆర్ఎస్ నాయకులు చేసిన ఆగడాలను, అవినీతిని సమీక్షిస్తూ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో ప్రజారంజక పాలన అందిస్తామని మానాల మోహన్ రెడ్డి తెలిపారు.