ఈరోజు, రేపు కొన్ని చోట్ల మోస్తారు గాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు. వర్షాలు అనేవి తగ్గవు రేపటి సాయంత్రం వరకు గాలులు కుడా రేపు సాయంకాలం వరకు నమోదవుతాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
ఈరోజు తెల్లవారుజామున సమయం నుంచి మోస్తారుగా వర్షాలు పడుతున్నాయి. కానీ అసలైన వర్షాలు కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది.
భారీ వర్షాలు ఎక్కడెక్కడ నమోదవుతాయి
వర్షాలు కృష్ణా, గుంటూరు, బాపట్ల, రేపల్లె, విజయవాడ, ఏలూరు, గుడివాడ, బీమవరం,మచిలీపట్నం,జంగారెడ్డిగూడెం కాకినాడ, తుని, యానాం విశాఖపట్నం, విజయనగరం, మొత్తం జిల్లా లోని అన్నీ భాగాల్లోకి వర్షాలు విస్తరిస్తాయి.
భారీ వర్షాలు అనేవి ఈరోజు, రేపు నమోదవుతాయి. గాలులు గంటకి 65-70 కిలోమీటర్లు వేగంతో వీస్తాయి. డిశంబర్ 6, 7 అక్కడక్కడ వర్షాలు మాత్రమే నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.