బాన్సువాడ, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు గాను బుధవారం బాన్సువాడ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ బిఆర్ఎస్ పార్టీ నుండి బోర్లం గ్రామ ఎంపీటీసీ శ్రావణి, రైతుబంధు మండల డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు భూనేకర్ జ్యోతి, సీనియర్ నాయకులు ప్రకాష్‌ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు పార్టీ దృష్టికి రావడంతో పార్టీ ఆదేశానుసారం వారిని వాటి నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, సీనియర్ నాయకులు దొడ్ల వెంకటరామిరెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎజాస్ తదితరులు పాల్గొన్నారు.