నిజామాబాద్, డిసెంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా శనివారం కాంగ్రెస్ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ లక్ష్యంతో అయితే సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ లక్ష్యం నెరెవరే దిశగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ వచ్చిన నుండి దొరల గడీల వున్న తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజుగా పరిగణిస్తామని, తెలంగాణ ప్రజల కష్టాలను చూసి, ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వుండాలని కోరుకుంటూ, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారి ఆలోచనలను,ఆశయాలను అందిపుచ్చుకొని పిలుపునిచ్చారు.
గత ఐదు సంవత్సరాలుగా ప్రజల పక్షాన వారి హక్కులకో ఏ విధంగా ఉద్యమాలు చేశామో అదేవిధంగా ప్రజల హక్కుల కోసం, ప్రజల తెలంగాణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆయన సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని నాయకులకు సూచిస్తూ మరోసారి మానాల మోహన్ రెడ్డి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కేశ వేణు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, తెలంగాణ ప్రధాయిని సోనియాగాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోనియా గాంధీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడాన్ని హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా శనివారం మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని, ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని ఆయన అన్నారు.
పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్బిన్ హంధాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి పుట్టినరోజు కానుకగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను ఈరోజు అమలు చేయడం జరిగిందని అందులో భాగంగా మహాలక్ష్మి పేరుతో ప్రతి మహిళకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని అదేవిధంగా ఆసుపత్రిలలో వైద్యం కొరకు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం బీమా కల్పించడం జరిగిందని ఈ కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఉందని ఆయన తెలిపారు.
నగర మాజీ మేయర్ సంజయ్ మాట్లాడుతూ సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఆశయం కొరకైతే తెలంగాణ ప్రజల అభివృద్ధి కొరకు ఇచ్చారో ఆ అభివృద్ధి నెరవేరే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. నిరుపేద ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు ఉన్న సమస్యలు ఉన్న కాంగ్రెస్ నాయకులను సంప్రదించాలని, ఇకపై ప్రజల పాలన కొనసాగుతుందని ప్రజా సంక్షేమమే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆయన అన్నారు.
కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, జిల్లా ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, జిల్లా యస్టి సెల్ అధ్యక్షులు యాదగిరి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈసా, అర్బన్ ఆబ్జర్వర్ రామకృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, చంద్రకళ, మలైకా బేగం, యూత్ కాంగ్రెస్ నాయకులు సుమన్, నగర మహిళా అధ్యక్షురాలు రేవతి, నగర ఎస్సీ అధ్యక్షులు వినయ్, నగర ఎస్టీ అధ్యక్షులు సుభాష్, గన్రాజ్, విజయ్ పాల్ రెడ్డి, రవి, ఎల్లయ్య, సాయిలు, స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.