గ్రామీణ తపాల ఉద్యోగుల నిరవధిక సమ్మె

ఆర్మూర్‌, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఆర్మూర్‌ గ్రామీణ తపాల శాఖలో జిడిఎస్‌ల నిరవధిక సమ్మె సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు కేంద్ర సంఘాలు ప్రయత్నించినప్పటికీ డిమాండ్లు నెరవేర్చే సూచనలు కనబడకపోవడం వలన నిరవేదిక సమ్మె తప్ప వేరే మార్గం లేకపోవడంతో నిరవధిక సమ్మె చేస్తున్నామని ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ తపాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12 నుండి నిరవేధిక సమ్మె చేస్తున్నామని రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ మంథిని బీపీఎం ఏ.లింబాగౌడ్‌, ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ అధ్యక్షులు మచ్చర్ల బీపీఎం ఎం.రమేష్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెర్కిట్‌ బీపీఎం పి.శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

జిడిఎస్‌ల డిమాండ్లలో ముఖ్యంగా తమ పని వేళలను 8 గంటలకు నిర్ణయించాలని, పెన్షన్‌ తో పాటు అన్ని ప్రయోజనాలు మంజూరు చేయాలని, టిఆర్సీఏ రేషనల్‌ ఫిక్సేషన్‌ సహా కమలేష్‌ చంద్ర కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, రెగ్యులర్‌ ఎంప్లాయిస్‌కు ఇచ్చినట్లు వెయిటేజి, ఇంక్రిమెంట్స్‌ సీనియర్స్‌కు ఇవ్వాలన్నారు.

12, 24, 36 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఆర్థిక ఉన్నతి కల్పించాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ 5 లక్షల పెంచాలని, డిపార్ట్‌ మెంట్‌ స్టాప్‌తో సమానంగా జిడీఎస్‌ లకు గ్రాట్యూవిటీ పెంచాలన్నారు. పెయిడ్‌ లీవ్స్‌ 180 రోజుల వరకు దాచుకొని నగదుగా మార్చుకొనే సౌకర్యం కల్పించాలని, జీడీఎస్‌ కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని, పూన్షన్‌ కాంట్రిబ్యూషన్‌ 3 శాతం నుండి 10శాతానికి పెంచి రిటైర్డ్‌ జీడీఎస్‌లకు హడాక్‌ పెన్షన్‌ మంజూరు చేయాలన్నారు. ఇన్‌ సెంటీవ్స్‌ / కమీషన్‌ పద్ధతులు రద్దు చేసి ప్రతీ పనిని వర్క్‌ లోడ్‌లోకి తీసుకోవాలన్నారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీడీఎస్‌ల 5 గంటల పనికి సెకండ్‌ టి.ఆర్‌, సి.ఎ ఇవ్వాలని, అలాగే వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, బిజినెస్‌ టార్గెట్‌ల పేరుతో జీడీఎస్‌ లను వేదించే పద్దతులను సొంత మొబైల్‌ ఫోన్‌లను ఉపయోగించాలనే ఒత్తిడిని ఆపివేయాలన్నారు. ఫెస్‌బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ లాంటి సోషల్‌ మీడియా స్లాట్‌ ఫారంలను అనుసరించాలని బలవంత పెట్టకూడదన్నారు.

సేవలను విసృతం చేయడానికి సత్వరంగా అందించడానికి ఆర్‌ ఐసిటి డివైజ్‌ లను ఉపసంహరించి ల్యాప్‌ టాప్‌లు, ప్రింటర్స్‌, బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌ వర్క్‌లు బ్రాంచ్‌ పోస్టాఫీసులకు ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ న్యాయమైన కోరికలను తీర్చాలన్నారు. లేకపోతే నిరవధిక సమ్మెను మరింత ఉదృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సబ్‌ డివిజన్‌ పరిధిలోని 20 ఎస్‌ వోల బీపీఎంలు ఏబీపీఎంలు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »