ఆర్మూర్, డిసెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్మూర్ ఎక్సైజ్ టీం ఆలూర్ దేగామా రోడ్డు మార్గంలో గస్తీ నిర్వహిస్తుండగా ఆలూరు పల్లె ప్రకృతి వనం సమీపంలో రాజేష్ ముఖ్య అను వ్యక్తి గంజాయి ప్యాకెట్స్ అమ్ముతున్నారని సమాచారం మేరకు ఆర్మూర్ ఎక్సైజ్ శాఖ సిబ్బంది అనుమానాస్పదంగా కనిపించిన రాజేష్ ముఖ్య అనే వ్యక్తిని పట్టుకొని తనిఖీ చేశారు.
అతని వద్ద గంజాయి మూట లభించింది. వెంటనే అతన్ని అరెస్టు చేసి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి అతని వద్ద ఉన్నటు 220 గ్రాముల గంజాయిని సీజ్‌చేసి కోర్టులో హాజరు పరిచినట్టు ఎక్సైజ్ అధికారులు వెల్లడిరచారు. ఈ తనిఖీలో ఆర్మూర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్, సబ్ ఇన్స్పెక్టర్ ఏ గంగాధర్, ప్రమోద్ చైతన్య, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ గౌడ్, కానిస్టేబుల్స్ దేవిదాస్, సాయిబాబా గౌడ్, గొల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.