బాన్సువాడ, డిసెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ నర్సింగ్ కాలేజ్ నిర్మాణ పనులను బుధవారం మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు నాణ్యతతో చేపట్టి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను గుత్తేదారునికి ఆదేశించారు.
అనంతరం నర్సింగ్ విద్యార్థులు సమావేశమైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎస్‌ఆర్‌ఎంకే డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో భుజంగరావు, కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, భగవాన్ రెడ్డి విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.