కామారెడ్డి, డిసెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సెట్విన్ సంస్థ (యువజన సర్వీసుల శాఖ ) ఆధ్వర్యంలో మూడు నెలల కాలపరిమితి గల ఆరు రకాల కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదని ఆ సంస్థ కో ఆర్డినేటర్ సయ్యద్ మొయిజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏం.ఎస్. ఆఫీసు, అకౌంట్స్ ప్యాకేజి, టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వరకు, మెహందీ కోర్సులలో ఈ నెల 15 నుండి శిక్షణ ఇవ్వనున్నామని ఆయన తెలిపారు.
కోర్సు కాలంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించనున్నామని, కాగా కోర్సు ఫీజులో 50 రాయితీ ఇవ్వడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కోర్సు పూర్తైన పిదప సెట్విన్ సంస్థ ద్వారా నిర్వహించే పరీక్షలో ఉతీర్ణులైన వారికీ సరిఫికేట్ అందజేయబడునని, అట్టి ధ్రువపత్రం ద్వారా స్వయం ఉపాధి పధకాలు చేపట్టవచ్చని అయన సూచించారు.
ఇట్టి కోర్సులో ప్రవేశానికి 10 వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినా వారు అర్హులని అన్నారు. ఇట్టి కోర్సులలో ప్రవేశం పొందగోరే జిల్లాకు చెందిన అభ్యర్థులు వెంటనే 7386180456 లేదా 7989159121 ఫోన్ నెంబరుకు సంప్రదించవలసినదిగా సయ్యద్ మొయిజ్ తెలిపారు.