సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్‌ కళాశాల సమావేశమందిరంలో సైబర్‌ సురక్షిత- జాతీయ భద్రతా అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్స్పెక్టర్‌ కె. కృష్ణ మాట్లాడుతూ మితిమీరిన స్మార్ట్‌ ఫోన్ల వినియోగం అలవాటుగా మారి, వ్యసనంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇది శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, మానసిక చికాకులు, మనోవ్యాదులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

సైబర్‌ క్రైమ్‌ ఇన్స్పెక్టర్‌ ముకుంద పాషా మాట్లాడుతూ ఫోన్‌ ను కేవలం మాట్లాడడం కోసం మెసేజ్‌ చేయడం కోసం ఇంటర్నెట్‌లో అవసరమైనది సర్చ్‌ చేయడం కోసం మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు. కానీ మధ్యలో సోషల్‌ మీడియా వచ్చి పూర్తిస్థాయిలో మనపై ఆధిపత్యం చెలాయిస్తుందని, రోజు సోషల్‌ మీడియా కోసం 5 నుంచి 8 గంటల సమయం కేటాయిస్తున్నారని ఇటీవలి సర్వేలు పేర్కొన్నాయన్నారు.

అవసరంలేని యాప్‌లను అప్లోడ్‌ చేసుకొని సైబర్‌ మోసాలకు గురికావొద్దని అభిప్రాయపడ్డారు. ఈ సైబర్‌ నేరవాళ్ళు ఫోన్‌ చేసి మీకు ఈ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకుంటే ఇంత అమౌంట్‌ మీకు అకౌంట్లోకి వస్తుందని నమ్మబలికి ఓటిపి సెండ్‌ చేయాలి అని అడిగి 15 నిమిషాల తర్వాత మీ అకౌంట్‌లోకి 50 వేలు, లేదో లక్ష రూపాయలు వస్తుందని మోసం చేస్తారని హెచ్చరించారు.

సైబర్‌ నేరాల బారిన పడిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని అలా చేసుకోకూడదని మనో ధైర్యం పెంచుకొని పోలీసులను సంప్రదించాలని సూచించారు. మీకు సైబర్‌ నేరగాళ్లకు సంబందించిన సమస్య వస్తే వెంటనే ఈ నెంబర్‌కు 1930 కాల్‌ చేస్తే మా సిబ్బంది అన్నివిధాలా మీకు సహాయపడుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమానికి మహేష్‌ సిఐ, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సిహెచ్‌ హారతి, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రసన్న రాణి, అధ్యాపకులు అడ్మిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంపత్‌, అకాడమిక్‌ ఆడిట్‌ సెల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అతిక్‌ సుల్తాన్‌ గోరి, డాక్టర్‌ సంపత్‌, పోలీస్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »