కామారెడ్డి, డిసెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏంటో గాని ఆటో డ్రైవర్లము రోడ్డుపైన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆడవాళ్లకు బస్సులో ఉచిత ప్రయాణంను మేము స్వాగతిస్తున్నామని కానీ మేము కూడా మీకు ఓటు వేయడం జరిగిందని మా ఆటో యూనియన్ల డ్రైవర్ల పరిస్థితి రోడ్డున పడ్డామని దయచేసి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆటో యూనియన్ వాళ్లకు కూడా జీవనో మృతి కింద నెలకు 15 వేల నుండి 20 వేలు ఇవ్వగలరని తెలిపారు.
బస్సులలో ఉచిత ప్రయాణం అనగానే ఆటోలలో ఎవరు ఎక్కడం లేదని రోజు వంద రెండు వందల రూపాయలు రావడం జరుగుతుందని, అవి కూడా ఆటోలో డీజిల్ పోయడానికే సరిపోతుందన్నారు. బస్సులో ఉచిత ప్రయాణం లేనప్పుడు రోజుకు 500 నుండి 1000 రూపాయలు సంపాదించుకునేవారిమని, దయచేసి మాకు కూడా పిల్లలు ఉన్నారని ఫైనాన్స్‌ల ద్వారా ఆటోలు తీసుకోవడం జరిగిందని, వెంటనే నెలకు 20 వేల రూపాయలు ఇవ్వగలరని ఆవేదన వ్యక్తం చేశారు.