బాన్సువాడ, డిసెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బీర్కూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం అమలు తీరును ఎంపీపీ రఘు, ఎంపీడీవో భానుప్రకాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెను ప్రకారం కూరగాయలు పెట్టకుండా నీళ్లచారు, సాంబారు వడ్డించడంపై సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాలలో భోజనం సరిగా ఉండకపోవడంతో విద్యార్థులు ఇంటి నుంచి లంచ్ బాక్సులు తీసుకొని రావడంతో ఎంపీపీ ఎంపీడీవో విద్యార్థులను మధ్యాహ్న భోజనంపై సమస్యలను అడిగి తెలుసుకోగా విద్యార్థులు అన్నం ఉడకడం లేదని తింటే కడుపునొప్పి వస్తుందంటూ విద్యార్థులు వారి దృష్టికి తీసుకువచ్చారు.