ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్‌ స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్‌ సిఫారసు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తున్న ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండిరగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు.

కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఎవో మసూర్‌ అహ్మద్‌, డి ఆర్‌ డి ఓ సాయన్న, కలెక్టరేట్‌ లోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »