కామారెడ్డి, డిసెంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రానికి చెందిన స్వప్న (20) గర్భిణీ అనిమీయ వ్యాధితో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఓ నెగటివ్ రక్తం లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని పరిదీపెట్ గ్రామానికి చెందిన అనిల్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి 3వ సారి రక్తాన్ని జిల్లా కేంద్రంలోని కేబీసీ రక్తనిధి కేంద్రంలో అందజేశారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేయడానికి రక్తదాతలు ముందుకు రావాలని,రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని అన్నారు. రక్తదానం చేయడం అంటే తోటి వారి ప్రాణాలను కాపాడమే కాకుండా రక్తదాతలు వారి ప్రాణాలను క్యాన్సర్, గుండెపోటు నుండి కాపాడుకోవచ్చునని అన్నారు. రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు.