ఇంజనీరింగ్‌ కాలేజీలో ఫ్రెషర్స్‌ డే

ఆర్మూర్‌, డిసెంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఆర్మూర్‌లోని క్షత్రియ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంబీఏ డిపార్ట్మెంట్‌ ఫ్రెషర్స్‌ డే సెలబ్రేషన్స్‌ ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా క్షత్రియ కళాశాలల కార్యదర్శి అల్జాపూర్‌ దేవేందర్‌ విచ్చేసి మాట్లాడారు.

పీజీ చదువుతున్న విద్యార్థులు కష్టపడి తమ లక్ష్యాలను సాధించుకోవాలని కాలానుగుణంగా వస్తున్న సాంకేతిక మార్పులను గమనిస్తూ, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తేనే భారత్‌ 2047 నాటికీ అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్‌ భారత్‌) మారుతుందని అన్నారు. ప్రస్తుతం భారత్‌ 5 ట్రిలియన్‌ ఆర్ధిక వ్యవస్థగా మారడానికి సిద్ధంగా ఉందన్నారు. అన్ని రంగాల్లో యువకులు తమ శక్తి సామర్ధ్యాలకు అనుగుణంగా పనిచేయాలని నైరాశ్యాన్ని, నకారాత్మక భావాలను విడిచిపెట్టి దైర్యంగా ముందుకెల్లాలని అభిలషించారు.

విద్యార్థులు కేవలం వివాహం కారణంగా విద్య ఉద్యోగాలను త్యాగం చేయవద్దని వివాహమైన తర్వాత కూడా చదువులు కొనసాగించాలని ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. కొత్త నూతన విద్యా విధానం ద్వారా తిరిగి భారత సనాతన మూలాలను తిరిగి కొనసాగిస్తూ, భరతమాత సేవలో భారత్‌ ను విశ్వ గురువుగా నిలిపేందుకు కోసం విద్యార్థులు కృషి చేయాలని కోరారు.

ప్రిన్సిపల్‌ ఆర్కె పాండే మాట్లాడుతూ విద్యార్థులకు హాజరు అత్యవసరమని ప్రతిరోజు తరగతులకు హాజరవడం ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్స్‌ నేర్చుకుంటారని తద్వారా వారు నిత్యజీవితంలో మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు కోసం ఉపయోగపడతారని అన్నారు. తరగతి గదిలో పూర్తిస్థాయి విద్యార్థులు ఉన్నప్పుడే టీచర్స్‌కు పాఠాలు చెప్పాలనే ఆసక్తి పెరుగుతుందని అన్నారు. విద్యార్థులు గ్రూపులుగా లైవ్‌ ప్రాజెక్ట్‌ చేయాలని, సమస్యల పట్ల లోతైన పరిశీలనాత్మక దృక్పథాన్ని అలవర్చుకోవాలని అభిలాషించారు.

హెచ్‌ ఓ డి డాక్టర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ విద్యార్థులు రెగ్యులర్‌గా క్లాస్‌లకు హాజరు కావడం వలన నైపుణ్యం పెరుగుతుందని, ప్రతి నిత్యం విద్యార్థులు క్లాస్‌లో టీచర్లకు ఛాలెంజ్‌ ఉండేవిధంగా తరగతులకు ముందే ప్రిపేర్‌ అయ్యి రావాలని అన్నారు. తద్వారా బోధనా మరింత సమర్ధవంతంగా ఉంటుందన్నారు.

కార్యక్రమానికి ఎంబీఏ డిపార్ట్మెంట్‌ టీచర్స్‌ పాశం సుధాకర్‌, ప్రతిమ, భరత్‌, అనూష, ఇతర విభాగాల అధిపతులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ రకాల నృత్యాలు నాటకాలను ప్రదర్శించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »