కామారెడ్డి, డిసెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారత ఆహార సంస్థకు కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాలను ఈ నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరెట్ లోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సి. ఏం. ఆర్ లక్ష్యాలను పూర్తి చేయని మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లక్ష్యాలు పూర్తి చేయని 29 రైస్ మిల్లుల యజమానులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 50 శాతం లోపు మిల్లింగ్ లక్ష్యాలు ఉన్న యజమానులు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు.
రైస్ మిల్లు యజమానులు పోటీ తత్వం అలవర్చుకొని తమ లక్ష్యాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. మిల్లుల వారిగా సమీక్ష చేపట్టారు. సమావేశంలో జిల్లా పౌరసరపరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ అభిషేక్ సింగ్, సహాయ పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, డిప్యూటీ తహసిల్దారులు, రైస్‌మిల్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.