బాన్సువాడ, డిసెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కు భారీ షాక్ తగిలింది. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 80 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని, రానున్న ఎంపీ, స్థానిక సంస్థ ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు సమనంతో పనిచేసి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను గెలిపించుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు అక్బర్, లయాక్, సలీం, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. 80 మంది కార్యకర్తలు చేరారు.