డిచ్‌పల్లి, డిసెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయంలో క్రీడా మైదానంలో అంతర్ కళాశాలల ఖో ఖో విద్యార్థినిలు క్రీడల జట్ల ఎంపిక నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ కళాశాలల నుండి 100 మంది పైగా సెలక్షన్‌లో పాల్గొన్నారు. క్రీడా నైపుణ్యం కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ క్రీడా పోటీలకు పంపనట్టు తెలిపారు.
ఈ సెలక్షన్‌లను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార ఏం యాదగిరి హాజరై క్రీడాకారులను, పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ సెలక్ట్ అయిన క్రీడాకారులు సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ పోటీలలో పాల్గొని చక్కని ప్రతిభను కనపరచాలని తద్వారా కళాశాలలకు, వర్సిటీకి మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకురావాలని కోరారు.
ఖో ఖో పురుషుల జట్టు యూనివర్సిటీ ఆఫ్ కాళికాట్ కేరళలో డిసెంబర్ 26 నుండి 30 తేదీలలో జరుగుతాయని పేర్కొన్నారు. ఖో ఖో మహిళల జుట్టు ఈనెల 26 నుండి 29 వరకు తమిళనాడులోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో నిర్వహిస్తారని తెలిపారు. సెలక్షన్‌లో వర్సిటీ క్రీడావిభాగం డైరెక్టర్ డాక్టర్ బాలకిషన్, డాక్టర్ బి.ఆర్ నేత, ఫిజికల్ డైరెక్టర్స్ అనిల్ కుమార్, సౌమ్య మరియు జూనియర్ అసిస్టెంట్ నరేష్ జాదవ్ పాల్గొన్నారు.