కామారెడ్డి, డిసెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆవరణలో 2 కె రన్ ను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రన్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యువత ప్రతిరోజు ఉదయం రన్ చేయాలని సూచించారు.
కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కే. సారంగపాణి, ట్రెజరర్ రాజేష్, హర్యానా ఆర్గనైజేషన్ రాష్ట్ర పరిశీలకుడు నారాయణ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, ఇతర సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్ లు, మేనేజర్లు తోపాటు అనధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు కార్యక్రమానికి హాజరైన అన్ని శాఖల అధికారులు, వ్యాపార సంస్థల ప్రతినిధులకు అసోసియేషన్ తరపున అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి, అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.