ఆర్మూర్, డిసెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 26వ ఆదివారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు కలిసి రెండు గంటల పాటు శ్రమించి కాలనీలోని పిల్లల పార్కును శుభ్రం చేశారు, పార్కులోని చెట్ల కొమ్మలను కట్టర్‌తో కత్తిరించారు.
ముళ్ల పొదలను, పిచ్చి మొక్కలను తొలగించారు. పారలతో మట్టిని ఎత్తి ఒక పక్కన వేశారు. స్వచ్చతలో తాము సైతం అంటూ చిన్నారి పిల్లలు కూడ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్బంగా జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గోసికొండ అశోక్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి మళ్ళీ ప్రబలుతున్న దృష్ట్యా కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్చ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో పాల్గొంటున్న కాలనీ వాసులకు. పురపాలక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ కుమార్, అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్, ఉపాధ్యక్షులు సుంకే శ్రీనివాస్, కొక్కెర భూమన్న, కార్యదర్శులు కొంతం రాజు, సాయన్న, ఆలయ కమిటీ కోశాధికారి ఎర్ర భూమయ్య, ఎస్సారెస్పి డీఈ గణేష్, టోనా, వరలక్ష్మి, భాజన్న, పురపాలక ఉద్యోగి వెన్న మోహన్, హరితహారం సిబ్బంది పాల్గొన్నారు.