నిజామాబాద్, డిసెంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజా పాలన కార్యక్రమంపై జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమితులైన రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమీక్ష సమావేశంలో నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల అధికారులు పాల్గొంటారని అన్నారు. ఆరు గ్యారంటీల అమలు కోసం ఈ నెల 28 నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులలో నిర్వహించనున్న ప్రజా పాలన కార్యక్రమం అమలు తీరుపై జిల్లా ఇంచార్జి మంత్రి ఉమ్మడి జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేస్తారని కలెక్టర్ వివరించారు. సంబంధిత అధికారులందరు సమగ్ర వివరాలతో సకాలంలో సమావేశానికి హాజరు కావాలని సూచించారు.