నిజామాబాద్, డిసెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం అమలు తీరును జిల్లా స్థాయిలో పరిశీలించేందుకు వీలుగా సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల నోడల్ అధికారిగా సీనియర్ ఐ.ఏ.ఎస్ అయిన క్రిస్టినా జెడ్.చోంగ్తును నియమించారు. ఉభయ జిల్లాలో ప్రజా పాలన సభల నిర్వహణ తీరును పరిశీలిస్తూ, ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగేలా కృషి చేయనున్నారు.