నిజామాబాద్, డిసెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29 శుక్రవారం రోజున 101 గ్రామాలలో సభలను నిర్వహించి ఆరు గ్యారంటీలపై ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనున్న గ్రామాల వివరాలను ఆమె వెల్లడిరచారు.
ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని గుత్ప, గుత్పతండా, చేపూర్, ఫతేపూర్, పిప్రి, సురభిర్యాల్, దత్తాపూర్, డొంకేశ్వర్, బొంకన్పల్లి, కిందితండా, మాక్లూర్, ముల్లంగి(బి), ఆంధ్రనగర్, కౌల్పూర్, నందిపేట, వెల్మల్ లో ప్రజాపాలన సభలు జరుగుతాయని తెలిపారు.
అదేవిధంగా బాల్కొండ సెగ్మెంట్ లోని బుస్సాపూర్, నాగాపూర్, దేవక్కపేట, కొత్తతండా, రహత్నగర్, తాళ్ళపల్లితండా, బషీరాబాద్, నాగపూర్, నరసాపూర్, కొనసముందర్, దూదిగాం, మెండోరా, పోచంపాడ్, దొన్కల్, శెట్పల్లి, సుంకెట్, తిమ్మాపూర్, ముప్కాల్, రెంజల్, వేంపల్లి, పచ్చలనడికుడ, వేల్పూర్, దోంచంద, గుమ్మిరియల్, తడపాకల్, తొర్తి లలో ప్రజాపాలన సభలు జరుగుతాయన్నారు.
అలాగే, బాన్సువాడ సెగ్మెంట్లోని నిజామాబాద్ జిల్లా పరిధిలో గల చందూర్, ఏక్లాస్పూర్, ఎత్తోండ, కోటగిరి, లింగాపూర్, గోవూరు, కొల్లూరు, కోడిచెర్ల, రుద్రూర్, మల్లారం, రాజ్ పేట్, శంకోరా, తగిలేపల్లి గ్రామాలలో సభలు జరుగుతాయన్నారు.
బోధన్ నియోజకవర్గం పరిధిలోని లాంగ్డపూర్, మినార్పల్లి, నాగంపల్లి, పెగడాపల్లి, అబ్బాపూర్(ఎం), అభంగపట్నం, కమలాపూర్, కోస్లీ, భాగేపల్లి, కూనేపల్లి, నీలా, రెంజల్, హున్సా, సాలంపాడ్ క్యాంప్, మంగళ్ పాడ్, ఎంఎస్సి.ఫామ్, నెహ్రూనగర్, వడ్డేపల్లి గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని బిల్యా తండా, చల్లగరిగే, ధనంబండ తండా, మద్దులతండా, మారియా తండా, వాడి, ఆరెపల్లి, ధర్మార్(బి), నడిపల్లి, నడిపల్లి తండా, గంగారాం తండా, లోలం, మల్లాపూర్, తీర్మాన్ పల్లి, అర్గుల్, జక్రాన్పల్లి, లక్ష్మాపూర్, నారాయణపేట, భైరాపూర్, చిన్నాపూర్, కాల్పోల్, కులాస్పూర్, ధర్మారం(ఎం), ధర్మారం తండా, కేశాపూర్, కొండూరు, గోప్యతాండా, గోప్యనాయక్ తండా, పాకాల, వార్జున్ తండాలలో శుక్రవారం ప్రజాపాలన సభలు జరుగుతాయని డీపీఓ జయసుధ తెలిపారు.