కామారెడ్డి, డిసెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సిఎంఆర్ ను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పౌరసరపరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్‌ఐసి భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులతో మాట్లాడారు.
ఖరీఫ్ 2023-24 ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సిఎంఆర్ అందజేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో గత యాసంగి లో పండిరచిన 2,18,193 మెట్రిక్ టన్నులు పెండిరగ్లో ఉందని, ధాన్యాన్ని తక్షణమే మిల్లింగ్ పూర్తి చేసి సీఎంఆర్ కు అందజేస్తామని తెలిపారు. బాయల్డ్ రైస్ 1,15,828 మెట్రిక్ టన్నులు పెండిరగ్లో ఉందని, త్వరగా మిల్లింగ్ చేయిస్తామని చెప్పారు. లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేయని రైస్ మిల్ యజమానులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చాహన్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ అభిషేక్ సింగ్, జిల్లా సహాయ పౌరసరఫరాల శాఖ అధికారి నిత్యానంద్ పాల్గొన్నారు.