బాన్సువాడ, డిసెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాలలో వినియోగదారుల వారోత్సవాలను కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన శనివారం వినియోగదారుల సదస్సును నిర్వహించారు.. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఇందూర్ గంగాధర్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను, విధులను గూర్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
కళాశాల వినియోగదారుల కమిటీ అధ్యక్షుడు సహ ఆచార్య అంబయ్య మాట్లాడుతూ దేశంలో ఈ రోజులలో ప్రతి వస్తువు కల్తీ జరుగుతుంది, కావున వినియోగదారులు తమ హక్కులను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల వినియోగదారుల కమిటీ సభ్యులు వెంకట్రావు దీక్షిత్, పురుషోత్తం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు పోతరాజు శ్రీనివాస్, శ్రీదేవి, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.