కామారెడ్డి, డిసెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజా పాలనలో ప్రభుత్వం అందిస్తున్న అభయహస్తం ఆరు గ్యారంటీలు అర్హత గల ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకోనేలా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
శనివారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి, లింగాపూర్, తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కుటుంబ సభ్యులు ఎవరైనా ఆధార్, రేషన్ కార్డు చూపించి , దరఖాస్తు ఫారం తీసుకొని నింపి ఇవ్వాలని తెలిపారు. ఎంపీడీవోలు గ్రామ పంచాయతీల వారీగా దరఖాస్తు ఫారాలు అందజేయాలని చెప్పారు.
దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను సూచించారు. అర్హత గల ప్రతి కుటుంబం దరఖాస్తు చూసుకునేలా చూడాలని అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.