కామారెడ్డి, డిసెంబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా ప్రజలు అన్ని రంగాలలో రాణించి సుఖసంతోషాలతో విలసీల్లాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. 2024 ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కలెక్టర్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏడాదంతా ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అభిలషించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలన్నారు. గత అనుభవాలను మననం చేసుకుంటూ నూతన సంవత్సరంలో మరింత పట్టుదల, అవిరళ కృషితో విజయాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ జిల్లాను ప్రగతి పథాన పయనింపజేసేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.