Monthly Archives: December 2023

కామారెడ్డిలో అయోధ్య అక్షింతల భారీ శోభాయాత్ర

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అయోధ్య అక్షింతలు కామారెడ్డి నగరానికి వచ్చిన సందర్భంగా తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అక్షింతల కలశాలతో నగరపురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు ఈ యాత్ర ధర్మశాల నుండి రైల్వే స్టేషన్‌ బాంబే క్లాత్‌ పాన్‌ చౌరస్తా గర్ల్స్‌ హై స్కూల్‌ కోడూరి హనుమాన్‌ మందిర్‌ పెద్ద బజార్‌ మీదుగా నిజాం సాగర్‌ చౌరస్తా నుండి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ …

Read More »

నిత్యావసర సరుకుల పంపిణీ

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గల ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ సెవెన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో అధ్వర్యంలో ఫరీద్‌ పెట్‌ గ్రామంలోని ఇంటర్నేషనల్‌ ప్రేయర్‌ ఫెలోషిప్‌ చర్చిలో క్రిస్టమస్‌ వేడుకలు ఘనంగా జరిపారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎన్జీవో తరఫున నిరుపేద క్రిస్టియన్‌ కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాస్టర్‌ రత్నం, ఎన్జీవో ఫౌండర్‌ జీవన్‌ …

Read More »

క్రిస్మస్‌ శుభాకాంక్షలు – కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రిస్మస్‌ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ క్రిస్మస్‌ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని, అన్ని రంగాలలో నిజామాబాద్‌ జిల్లా మరింత ప్రగతి సాధించాలని అభిలషించారు.

Read More »

ఉత్సాహంగా స్వచ్ఛకాలనీ సమైక్య కాలనీ…

ఆర్మూర్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని జర్నలిస్ట్‌ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 26వ ఆదివారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు కలిసి రెండు గంటల పాటు శ్రమించి కాలనీలోని పిల్లల పార్కును శుభ్రం చేశారు, పార్కులోని చెట్ల కొమ్మలను కట్టర్‌తో కత్తిరించారు. ముళ్ల పొదలను, పిచ్చి మొక్కలను తొలగించారు. పారలతో …

Read More »

ముఖ్యమంత్రిగా నేడు తొలి సమావేశం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఆదివారం డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ‘ప్రజాపాలన’ …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 24,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి తెల్లవారుజాము 5.41 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 9.50 వరకుయోగం : సిద్ధం ఉదయం 8.28 వరకుకరణం : కౌలువ సాయంత్రం 6.00 వరకు తదుపరి తైతుల తెల్లవారుజాము 5.41 వరకు వర్జ్యం : ఉదయం 10.04 – 11.38దుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »

వైభవంగా వైకుంఠ ఏకాదశి

ఆర్మూర్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని కోటార్మూర్‌లో గల విశాఖ కాలనీ నందు గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి (ఉత్తర ద్వారా) దర్శనం పూజ కార్యక్రమం ఉదయం 4 నుండి భక్తుల దర్శనం ప్రారంభమైంది. ఆలయ అర్చకులు గౌతం పాండే ఆధ్వర్యంలో పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి రమా సత్యనారాయణ దేవతామూర్తులకు ఉత్తర ద్వార …

Read More »

కామారెడ్డిలో టుకె రన్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆవరణలో 2 కె రన్‌ ను శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. రన్‌ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యువత ప్రతిరోజు ఉదయం రన్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ …

Read More »

డెంటల్‌ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే

బాన్సువాడ, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాకేష్‌ డెంటల్‌ ఆసుపత్రిని శనివారం మాజీ స్పీకర్‌, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునాతన పరికారాలతో బాన్సువాడ పట్టణంలో డెంటల్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆసుపత్రి నిర్వాహకులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి …

Read More »

సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యం

ఎల్లారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే మదన్మోహన్‌ రావ్‌ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో శనివారం డివిజనల్‌ స్థాయి, మండల స్థాయి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »