Yearly Archives: 2023

అభ్యంతరాలుంటే తెలపాలి

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ కేంద్రాల మార్పుపై అభ్యంతరాలుంటే రాజకీయ పార్టీల నాయకులు ఈ నెల 3 న మధ్యాహ్నం 2 గంటలలోగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోరారు. బుధవారం కామారెడ్డి ఐ.డి.ఓ.సి.లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాలు గ్రామాలకు దూరంగా ఉంటే వాటిపై అభ్యంతరాలను తెలపాలని చెప్పారు. …

Read More »

ఈవిఎం గోదాముల పరిశీలన

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఈ.వి.ఏం. గోదామును బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను సి.సి.కెమెరాల పనితీరును పరిశీలించారు. గోదాములకు సీలు వేసిన తాళాలను చూశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ఎన్నికల పర్యవేక్షకులు సాయి భుజంగ రావు, ఉప తహశీల్ధార్‌ ఇందిర ప్రియదర్శిని, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Read More »

బిసి కుటుంబాలలో వెలుగులు

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బి.సి. కుల, చేతి వృత్తుల కుటుంబాలలో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి శాసనసభ్యుడు గంప గోవర్ధన్‌ అన్నారు. బుధవారం కామారెడ్డి ఐ.డి.ఓ.సి. లోని సమావేశ మందిరంలో కామారెడ్డి నియోజకవర్గ బి.సి. లబ్దిదారులకు లక్ష రూపాయల చొప్పున 300 మందికి 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల …

Read More »

విత్తన బంతులు వేసిన విద్యార్థులు

ఆర్మూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలములోని కోమన్‌ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు హరితహారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా 3034 విత్తనబంతులు తయారు చేశారు. ఇందులో నేరేడు656 వేప357, కానుగ 500, అల్లనేరేడు 1521ఉన్నాయి. వీటిని రోడ్ల కిరువైపుల, ఊరి బయటవేయడం జరిగింది. విద్యార్థుల కృషి,ఆలోచనను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సర్పంచ్‌ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూలూరి నర్సయ్య, గ్రామసర్పంచ్‌ నీరడి …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, ఆగష్టు 2, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహళ పక్షంతిథి : పాడ్యమి రాత్రి 10.25 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : శ్రవణం మధ్యాహ్నం 3.33 వరకుయోగం : ఆయుష్మాన్‌ సాయంత్రం 5.56 వరకుకరణం : బాలువ ఉదయం 11.37 వరకు తదుపరి కౌలువ రాత్రి 10.25వర్జ్యం : రాత్రి 7.17 – 8.46 దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

సీబీఆర్టీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల్లో బోధన, బోధనేతర ఖాళీల భర్తీ కోసం నియామక మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్మెంట్‌ టెస్ట్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి సూచించారు. సీబీఆర్టీ పరీక్షలను పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్‌ సమన్వయ …

Read More »

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

డిచ్‌పల్లి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో 12769 గ్రామపంచాయతీలో 50వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వేతనాలు పెంచి క్రమబద్ధీకరించాలని జేఏసీ ఆధ్వర్యంలో 2023 జూలై 6 నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య మొండి వైఖరి అవలంబిస్తుందని, తన మొండి వైఖరి విడనాడి వెంటనే జేఏసీతో చర్చలు జరిపాలని, పంచాయతి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సిపిఐ ఎంఎల్‌ …

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన కాసుల రోహిత్‌

బాన్సువాడ, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన గుత్తి మల్లు కొండకు చెందిన నివాసపు ఇల్లు ఇటీవల భారీ వర్షాలకు కూలిపోవడంతో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ యువజన నాయకుడు కాసుల రోహిత్‌ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం వారిని పరామర్శించిన పాపాన …

Read More »

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభం

బీర్కూర్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దామరంచ సొసైటీ చైర్మన్‌ కమలాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో బీర్కూరు మండలంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభించి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎలమంచిలి శ్రీనివాసరావు, పిసిసి డెలిగేట్‌లు డాక్టర్‌ కూనిపూర్‌ రాజారెడ్డి, వెంకటరామరెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షులు ప్రతాప్‌ సింగ్‌, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాన్సువాడ …

Read More »

7న ఓబిసి మహాసభ

నిజామాబాద్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 7న తిరుపతిలో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ గోడ పత్రికను మంగళవారం నిజామాబాద్‌ నగరంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు. మండల్‌ డే సందర్భంగా ఆగస్టు 7న తిరుపతిలో జరిగే అఖిల భారత జాతీయ ఓబిసి 8వ మహాసభ ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన గోడపత్రికను మంగళవారం నిజామాబాద్‌ జిల్లా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »