కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కామారెడ్డి వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రామ్ సింగ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఎన్జీవో తరపున చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ రామ్ సింగ్ మాట్లాడుతూ ఈ సమాజంలో మారుతున్న పరిణామాలు, పరిస్థితుల దృష్ట్యా సమాజ …
Read More »Yearly Archives: 2023
పరీక్ష అట్టలు,పెన్నుల వితరణ
ఆర్మూర్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలములోని కోమన్ పల్లి ప్రభుత్వపాఠశాల విద్యార్థులకు ఆర్మూర్ కు చెందిన ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ అనిల్ పడాల్ 86 పరీక్ష అట్టలు,పెన్నులు వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి చదవకుండా ఇష్టంతో చదువాలని అలాగే దంత పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.అనంతరం డాక్టర్ అనిల్ పడాల్‌ని గ్రామ సర్పంచ్ నీరడి రాజేశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు …
Read More »రెడ్‌క్రాస్ సేవలు నిరంతరం కొనసాగాలి
కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా రెడ్ క్రాస్ సంస్థ సేవలు నిరంతరం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… సి.పి.ఆర్. కార్యక్రమాలను జిల్లా, డివిజన్ స్థాయిలో …
Read More »అయాచితం నటేశ్వర శర్మకు కలెక్టర్ సన్మానం
కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దాశరధీ పురస్కారాన్ని పొందిన ప్రముఖ సంస్కృతాంధ్ర విద్వత్ కవి, అష్టావధాని డాక్టర్ ఆయాచితం నటేశ్వర శర్మకు మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సముచితంగా సత్కరించారు. జులై 22 న దాశరధి 99వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక, క్రీడా శాఖామాత్యులు డా. శ్రీనివాస్ …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, ఆగష్టు 1, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి రాత్రి 12.50 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ సాయంత్రం 5.09 వరకు యోగం : ప్రీతి రాత్రి 8.56 వరకుకరణం : విష్ఠి మధ్యాహ్నం 1.58 వరకు తదుపరి బవ రాత్రి 12.50వర్జ్యం : రాత్రి 8.53 – 10.22దుర్ముహూర్తము : …
Read More »జిల్లా కలెక్టరేట్ దిగ్బంధం
నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తక్షణమే వేతన పెంపును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ నిర్వహించారు. వందలాదిమంది గ్రామపంచాయతీ కార్మికులు సిబ్బందితో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు సుమారు రెండు గంటల పాటు బైఠాయించారు. దీంతో కలెక్టరేట్ కు రాకపోకలు ఆగిపోయాయి. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు …
Read More »జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌గా ఎల్‌ఎంబి రాజేశ్వర్ పదవికాలం పొడిగింపు
నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌గా ఆరుట్ల రాజేశ్వర్ (ఎల్‌ఎంబి) పదవికాలం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండు సంవత్సరాలు పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎల్‌ఎంబి రాజేశ్వర్ సెక్రటేరియట్‌లో మర్యాద పూర్వకంగా …
Read More »ఓటర్ల సౌకర్యార్ధం…
నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్ల సౌకర్యార్ధం ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ …
Read More »ఉత్తమ డ్రైవర్ అవార్డు అందుకున్న గంగాధర్
బాన్సువాడ, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ డిపోలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న పందిరి గంగాధర్ కు సోమవారం ఆర్టీసీ రీజినల్ కార్యాలయంలో ఉత్తమ డ్రైవర్గా అవార్డు ఆర్టీసీ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఎలాంటి పొరపాటు లేకుండా విధులు నిర్వహించి ఉత్తమ అవార్డు రావడంపై గంగాధర్ ఆనందం వ్యక్తం చేశారు.
Read More »నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించండి
హైదరాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్‌లో భేటీ …
Read More »