Yearly Archives: 2023

పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది..ప్రజలు ఆందోళన చెందవద్దు

నిజామాబాద్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నాలుగైదు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళనకు లోనుకావద్దని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం …

Read More »

భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ చాలీసా పారాయణము

ఆర్మూర్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ జర్నలిస్ట్‌ కాలనీ శ్రీ భక్త హనుమాన్‌ ఆలయంలో మంగళవారం హనుమాన్‌ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో హనుమాన్‌ చాలీసా పారాయణము చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో నిలబడి సామూహికంగా హనుమాన్‌ చాలీసా పారాయణము చేశారు. అనంతరం మంగళ హారతి ఇచ్చారు, జై శ్రీరామ్‌, జై హనుమాన్‌ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ …

Read More »

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

బాన్సువాడ, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సిని కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా మధ్యంతర భృతిని త్వరగా ప్రకటించి అనుకూలమైన పిఆర్సి అందించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోనేకర్‌ సంతోష్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడ మండలంలో నిరసన తెలియజేసి తహాసిల్దార్‌కు …

Read More »

కామారెడ్డిలో ఈవిఎం ప్రదర్శన కేంద్రం

కామరెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ లోని ఈవీఎం ప్రదర్శన కేంద్రం ను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఎలక్ట్రానిక్‌ యంత్రాలపై ఓటర్లకు అవగాహన కల్పించడానికి ఈవీఎం ప్రదర్శన కేంద్రం ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్‌ యంత్రాల ద్వారా ఓటింగ్‌ చేసి వాటిని పరిశీలించారు. ప్రతిరోజు కొత్త ఓటర్లు ఈ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్‌ చేసే విధానంపై …

Read More »

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ఆర్మూర్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్‌ యూనిట్‌ అధికారి సాయి మంగళవారం గోవింద్‌పెట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు విపరీతంగా కురుస్తున్నందున పరిసరాలు నీటితో నిండి ఉంటాయి కావున వారం రోజుల కంటే ఎక్కువ రోజులు నీటి నిల్వలు ఉండడం వలన డెంగ్యూ దోమలు వృద్ధి చెందే అవకాశం …

Read More »

వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మంత్రి, కలెక్టర్‌

వేల్పూర్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో వరద తాకిడికి గురైన ప్రాంతాలను మంగళవారం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సందర్శించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితి తీవ్రతను పరిశీలించారు. బాల్కొండ నియోజకవర్గంలోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్వస్థలమైన వేల్పూర్‌లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా …

Read More »

గల్ఫ్‌ కార్మికులు కుటుంబంతో జీవించే హక్కు అమలు చేయాలి

నిజామాబాద్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వలస కార్మికుల సామాజిక రక్షణ అనే అంశంపై మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ లో జరుగుతున్న బహుళ దేశాల ప్రాంతీయ సమావేశంలో గల్ఫ్‌ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డికి రియాక్టర్‌ (విషయంపై పరిజ్ఞానం కలిగి చర్చపై ప్రతిస్పందించే వ్యక్తి) గా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఒకనెల వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఉద్యోగ ఒప్పందాలలో ఉన్నప్పటికీ అమలు కావడం …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జూలై 25, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : సప్తమి ఉదయం 10.03 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : చిత్ర రాత్రి 8.05 వరకుయోగం : సిద్ధం మధ్యాహ్నం 12.25 వరకుకరణం : వణిజ ఉదయం 10.03 వరకు తదుపరి విష్ఠి రాత్రి 10.14 వరకువర్జ్యం : రాత్రి 1.52 – 3.32దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

ఏఐసీసీ కార్యదర్శిని కలిసిన నియోజకవర్గ నాయకులు

బాన్సువాడ, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్‌ అలీఖాన్‌ను సోమవారం బాన్సువాడ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ స్థితిగతులను ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందని ఒకసారి నియోజకవర్గానికి రావలసిందిగా ఎఐసిసి కార్యదర్శిని వారు కోరారు. ఈ సందర్భంగా ఏఐటిసి కార్యదర్శి పార్టీలో …

Read More »

బాధ్యతలు స్వీకరించిన నిజామాబాద్‌ ఆర్డీఓ

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీఓ) కే.రాజేంద్రకుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆర్డీఓ కు స్వాగతం పలికారు. నిజామాబాద్‌ ఆర్డీఓగా కొనసాగిన రవికుమార్‌ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో సూర్యాపేట ఆర్డీఓగా పనిచేసిన కే. రాజేంద్రకుమార్‌ను నిజామాబాద్‌ ఆర్డీఓగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »