Yearly Archives: 2023

వచ్చే నెలలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ

వేల్పూర్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తి అయిన డబుల్‌ బెడ్రూం ఇండ్లు వచ్చే నెలలో(ఆగస్టు) అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో నిర్మాణం పూర్తి అయిన,చివరి దశలో ఉన్న,పురోగతిలో ఉన్న …

Read More »

నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేయాలి

బోధన్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం వెంటనే తెరిపించి ప్రభుత్వపరం చేసి, 2015 సంవత్సరం నుండి కార్మికులకు రావాల్సిన బకాయిలను చెల్లించి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అనారోగ్య కారణాలతో చనిపోయిన కార్మిక కుటుంబాలను ఆదుకుని, కబ్జాలకు గురి అవుతున్న నిజాం షుగర్స్‌ భూములను రక్షించాలనే డిమాండ్‌లతో మిస్డ్‌ కాల్‌ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఫోన్‌ …

Read More »

ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర కీలకం

నిజామాబాద్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర ఎంతో కీలకమైనందున అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటింగ్‌ లో పాల్గొనాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అర్హులైన ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్‌ తెలిపారు. ఓటింగ్‌ ఆవశ్యకతను వివరిస్తూ, పోలింగ్‌ …

Read More »

సబ్సిడీ పరికరాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీలివిప్లవం 2018-19 పధకము, 2020-21,2021-22 ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సంచార చేపల వాహనములు, మూడు చక్రాల వాహనములు, ఐస్‌ బాక్సులు సబ్సిడీపై మంజూరు చేయుటకు అర్హత గల అభ్యర్దుల నుంచి ధరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి తెలిపారు. దరఖాస్తులో వాహనం మోడల్‌, కంపెనీ తెలియజేస్తూ ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న వారికి …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జూలై 21, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : చవితి పూర్తివారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మఖ మధ్యాహ్నం 12.16 వరకుయోగం : వ్యతీపాతం ఉదయం 11.46 వరకుకరణం : వణిజ సాయంత్రం 5.13 వరకువర్జ్యం : రాత్రి 9.05 – 10.51దుర్ముహూర్తము : ఉదయం 8.13 – 9.04, మధ్యాహ్నం 12.31 – 1.22అమృతకాలం …

Read More »

ఐటీ హబ్‌లో ప్రైవేట్‌ జాబ్‌మేళాలు సరే.. మరి ప్రభుత్వ ఉద్యోగాల మాటేమిటి

జక్రాన్‌పల్లి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగులను మభ్య పెట్టడానికే ఐటిహబ్‌ పేరుతో రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ జాబ్‌మేళా నిర్వహిస్తున్నారని మండల యువజన విభాగం అధ్యక్షుడు సొప్పరి వినోద్‌ విమర్శించారు. జక్రాన్‌పల్లి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జక్రాన్‌పల్లి మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సొప్పరీ వినోద్‌ మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ యువత కోసం బిఆర్‌ఎస్‌ …

Read More »

మైనార్టీల సంక్షేమంపై దృష్టి సారించాలి

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనారిటీల సంక్షేమంపై దృష్టి సారించాలని జాతీయ మైనారిటీ కమీషన్‌ సభ్యురాలు సయ్యద్‌ షాహేజాది అన్నారు గురువారం కామారెడ్డి కలెకర్ట్‌ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుతీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని మైనారిటీల స్థితిగతులు, వారి జనాభా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలు అమలు ద్వారా చేకూర్చుతున్న లబ్ది …

Read More »

పోలీస్‌ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ…

బాన్సువాడ, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద బుధవారం రాత్రి పోలీసు వాహనం అంబేద్కర్‌ చౌరస్తా నుండి పాత బాన్సువాడకు వెళ్ళుచుండగా బాన్సువాడ నుండి నిజామాబాద్‌ వెళ్తున్న లారీ వేగంగా వచ్చి పోలీస్‌ జీవును ఢీకొనడంతో పోలీసు వాహనం దెబ్బతిన్నదని పట్టణ సీఐ మహేందర్‌ రెడ్డి తెలిపారు. లారీ డ్రైవర్‌ పారిపోవడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ …

Read More »

లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక పూర్తి

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పధకం క్రింది 1వ, 5వ తరగతిలో ప్రవేశాలకై గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తల్లిదండ్రుల సమక్షంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. 1వ తరగతిలో 64 సీట్లకు, 70 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా లక్కీ డ్రా ద్వారా …

Read More »

ఓటింగ్‌ యంత్రాలపై చైతన్యం పొందాలి

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటింగ్‌ యంత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించుటకు గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌ లో ఏర్పాటు చేసిన ఈ.వి.ఎం., వివి ప్యాడ్‌ ల ప్రదర్శన కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్‌ యంత్రాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఓటింగ్‌ యంత్రాలపై …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »