Yearly Archives: 2023

ఏకధాటి వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడితో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని …

Read More »

అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే సేవలు మరువలేనివి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంతటి క్లిష్ట సమస్యలనైనా బ్యాలెన్స్‌ చేస్తూ ఓపికతో పరిష్కరిస్తూ వివిధ రంగాలలో జిల్లాను అభివృద్ధిపథంలో పయనించుటలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గా వెంకటేష్‌ దోత్రే సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశమందిరంలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు బదిలీపై వెళ్లిన వెంకటేష్‌ దోత్రేకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. …

Read More »

ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య లింబాద్రికి ఘన సన్మానం

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి స్వగ్రామమైన నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని రావుట్లలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయనకు అభినందనసభ నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి ముఖ్య అతిథిగా విచ్చేయగా, గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు, …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం చేసిన సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని నిమ్స్‌ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై రాజలక్ష్మికి అత్యవసరంగా బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. దీంతో హైదరాబాదులో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌కు తెలియజేయగానే వెంటనే స్పందించి బి పాజిటివ్‌ రక్తాన్ని …

Read More »

ఓటర్ల జాబితా పకడ్బందీగా రూపకల్పన చేయాలి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్ల జాబితా రూపకల్పన పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం ఎన్నికల అధికారులకు ఓటర్ల జాబితా రూపకల్పనపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రెండవ విడత ఓటరు జాబితా సవరణలో భాగంగా డ్రాఫ్ట్‌ ఓటరు జాబితా విడుదల ముందు వచ్చిన ప్రతి …

Read More »

మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా పరిపుష్టిని సాదించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని రోటరీ క్లబ్‌లో మంగళవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ఆధ్వర్యంలో మహిళ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మహిళలు వ్యవసాయంతో పాటు చేపల, తేనెటీగల, పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, కూరగాయల సాగు, …

Read More »

నిజామాబాద్‌కు నూతన మున్సిపల్‌ కమిషనర్‌

వేల్పూర్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన కమిషనర్‌ మకరంద్‌ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని వేల్పూర్‌ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపి, ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జూలై 18, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి రాత్రి 12.18 వరకువారం : మంగళవారం (భౌమ్యవాసరే)నక్షత్రం : పుష్యమి పూర్తియోగం : హర్షణం ఉదయం 9.57 వరకుకరణం : కింస్తుఘ్నం ఉదయం 11.28 వరకు తదుపరి బవ రాత్రి 12.18 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.31 – 3.17దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

కంటి ఆపరేషన్‌ నిమిత్తం సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సహాయం

ఆర్మూర్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో ఎటువంటి సహాయానికైనా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్న సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ తాజాగా ఆర్మూర్‌ పట్టణానికి చెందిన గుజుల సుధా అనే మహిళకు కంటి ఆపరేషన్‌ చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేదనే విషయం తెలుసుకొని సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ప్రభాస్‌ ఆమె కంటి ఆపరేషన్‌కి అవసరమైన డబ్బులను సమకూరుస్తానని …

Read More »

గల్ఫ్‌లో ఉన్న రైతులకు రైతు బీమా వర్తింపజేయాలి

నిజామాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొట్ట చేతపట్టుకుని గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబీమా వర్తింపజేయాలని, రేషన్‌ కార్డుల్లో పేరు లేనందున బీసీ చేతివృత్తుల లక్ష సాయం పథకానికి గల్ఫ్‌ రిటనీలు దరఖాస్తు చేసుకోలేకపోయారని, రేషన్‌ కార్డుల నుండి గల్ఫ్‌కార్మికుల పేర్లు తొలగించడం వలన ఆరోగ్యశ్రీ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని టిపిసిసి గల్ఫ్‌ ఎన్నారై కన్వీనర్‌ సింగిరెడ్డి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »