Yearly Archives: 2023

యువత పోటీతత్వం పెంచుకోవాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పోటీతత్వం పెంచుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతి లో నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం యువజనోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. యువత చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలో రాణించాలని, సేవాభావం అలవర్చుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు …

Read More »

కొనసాగుతున్న గ్రామ పంచాయతీ కార్మికుల కారోబార్ల నిరవధిక సమ్మె

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్నూరు మండల కేంద్రంలో 10 వ రోజు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఉద్యోగుల కార్మికుల జేఏసీ రాష్ట్ర నాయకులు పిల్లి యాదగిరి, గ్రామపంచాయతీ కార్మికుడు నాగభూషణం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కరోనా సమయంలో తాము కూడా పనిచేశామని, గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ …

Read More »

క్రీడాకారుడికి అండగా నిలిచిన బీసీ సంక్షేమ సంఘం

ఆర్మూర్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణానికి చెందిన ఓరుసు మహేష్‌ ఇటీవల గోవాలో నిర్వహించిన అండర్‌ 17 రూరల్‌ గేమ్స్‌ ఆఫ్‌ ఫెడరేషన్‌ ఇండియా నేషనల్‌ లెవెల్‌ గేమ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. ఆగస్టు 25న నేపాల్‌ భూటాన్‌లో జరిగే ఇంటర్నేషనల్‌ గేమ్స్‌లో ఎంపికయ్యారు. అక్కడ గేమ్స్‌లో పాల్గొనడానికి బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జూలై 15, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – బహళ పక్షంతిథి : త్రయోదశి రాత్రి 8.27 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 1.05 వరకుయోగం : వృద్ధి ఉదయం 10.10 వరకుకరణం : గరజి ఉదయం 8.18 వరకుతదుపరి వణిజ రాత్రి 8.27 వరకువర్జ్యం : ఉదయం 5.49 – 7.30దుర్ముహూర్తము : ఉదయం 5.35 – …

Read More »

డ్రాఫ్ట్‌ ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలి

కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో డ్రాఫ్ట్‌ ఓటరు జాబితా రూపకల్పన పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌, రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలపై సమీక్షా సమావేశం 2023 – అవగాహన, ఈ.వి.ఎం.లు, వి.వి. ప్యాట్‌ ల ఉపయోగం …

Read More »

కామారెడ్డిలో అగ్నిమాపక అవగాహన సదస్సు

కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా జడ్జి మరియు చైర్పర్సన్‌ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధమ శ్రేణి న్యాయమూర్తి భవాని, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు శ్రీధర్‌ మాట్లాడారు జిల్లా న్యాయస్థానంలో పనిచేసే వారికి అగ్నిమాపక సదస్సు ద్వారా అందరికీ గుర్తు చేసే విధంగా చాలా బాగుందని తెలిపారు. అగ్నిప్రమాదం …

Read More »

బాలికలలో రక్తహీనత లేకుండా అవగాహన కల్పించాలి

కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలికలలో రక్తహీనత లేకుండా అవగాహన కల్పించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం రక్తహీనత, బాల్య వివాహాల నిర్మూలన పై యునెస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, బాలికలు …

Read More »

ఓటర్ల జాబితాలో తప్పిదాలకు ఆస్కారం ఉండకూడదు

నిజామాబాద్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా చూడాలని, ముఖ్యంగా డబుల్‌ ఎంట్రీ, బోగస్‌ పేర్లు లేకుండా జాబితాను బీ.ఎల్‌.ఓ మొదలుకుని ఈ.ఆర్‌.ఓ స్థాయి వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అదే సమయంలో అర్హులైన …

Read More »

బాన్సువాడ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు

బాన్సువాడ, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డిఅన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుండి మాత శిశు ఆసుపత్రికి అనుసంధానంగా మూడు కోట్లతో నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని ఒకటిన్నర కోట్లతో ఏర్పాటు చేసిన 10 బెడ్స్‌ డయాసిస్‌ యూనిట్‌, 27 లక్షలతో ఏర్పాటు చేసిన స్పెషల్‌ న్యూ …

Read More »

చంద్రయాన్‌ వీక్షించిన విద్యార్థులు..

బాన్సువాడ, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బొర్లం గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయకుమార్‌ ఆధ్వర్యంలో ఇస్రో శాస్త్రవేత్తల చంద్రయాన్‌ 3 ప్రయోగం విజయవంతం కావాలని విద్యార్థులు ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్‌ కుమార్‌ చంద్రయాన్‌ 3 ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి వీక్షించారు. చంద్రయాన్‌ 3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »