Yearly Archives: 2023

ఈవిఎం గోదాము పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఈవీఎంలు, కంట్రోల్‌ యూనిట్లు, వివి ప్యాట్లు పనిచేస్తున్న తీరును పరిశీలించారు. ఈవీఎంలు, కంట్రోల్‌ యూనిట్లు, వివి ప్యాట్‌ యంత్రాలు పనిచేస్తున్న తీరును ఇంజనీర్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, ఎన్నికల పరిశీలకుడు సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.

Read More »

కామారెడ్డిలో మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, మాజీ మంత్రివర్యులు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, టీపీసీసీ మహిళ అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాల మేరకు పెరుగుతన్న కూరగాయల ధరలకు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ తెలంగాణ ప్రజల జీవితాలతో చలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వాలకు …

Read More »

అమ్రాద్‌లో గడప గడపకు బిజెపి

మాక్లూర్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ మాక్లూర్‌ మండలం అమ్రాధ్‌ గ్రామంలో మహా జన్‌ సంపార్క్‌ అబియన్లో భాగంగా గడప గడపకు బిజెపి కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్‌ నియోజకవర్గ నాయకులు కంచెట్టి గంగన్న మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించారు. మరోసారి మోడీ ప్రభుత్వం ఈసారి తెలంగాణ బిజెపి ప్రభుత్వం ఏర్పడడానికి …

Read More »

పోడు భూముల్లో ఇక దర్జాగా సాగు

నిజామాబాద్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూముల్లో ఇకపై గిరిజనులు దర్జాగా పంటలు సాగు చేసుకోవచ్చని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఎవరికీ భయపడాల్సిన, అణిగిమనిగి ఉండాల్సిన అవసరం లేకుండా భూముల హద్దులతో కూడిన సమగ్ర నక్షాతో ప్రభుత్వం పక్కాగా పట్టా పాస్‌ బుక్కులు అందిస్తోందని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం …

Read More »

51 వసారి రక్తదానం

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీకి చెందిన హజీర బేగం (58) కాలు ఆపరేషన్‌ నిమిత్తమై ప్రైవేటు వైద్యశాలలో ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్‌ కుమార్‌ 51 వ …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, 5 జూలై 2023తిథి : విదియ 10:02నక్షత్రము : శ్రవణం 2:56మాసము : ఆషాఢము (కృష్ణపక్షం)శాలివాహన శకం 1945శోభకృతు నామ సంవత్సరం (గ్రీష్మ రుతువు))ఉత్తరాయణంయోగము : వైధృతి 7:47కరణము : గరజి 10:02 పణజి 20:15 భద్ర 6:30సూర్య రాశి : మిధునరాశిచంద్ర రాశి : మకరరాశిఅమృతకాలము : 17:41 – 19:06అభిజిత్‌ ముహూర్తము :బ్రహ్మ ముహూర్తము: 4:17 – 5:05దుర్ముహూర్తము : 11:51 – 12:42వర్జ్యము : …

Read More »

పోడు భూముల పట్టాలు పంపిణీచేసిన మంత్రి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూములకు పట్టా పాస్‌ బుక్కుల పంపిణీతో ఇకపై గిరిజనులకే పోడు భూములపై పూర్తి హక్కులు లభించాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బిక్కుబిక్కుమంటూ, భయంభయంగా పంట పండిరచే దుస్థితి దూరమయ్యిందని అన్నారు. పట్టాల పంపిణీతో యజమానులుగా మారిన గిరిజనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ధైర్యంగా పంటలు సాగు చేసుకోవచ్చని …

Read More »

తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు/ జూనియర్‌ కళాశాలల్లో ఆంగ్ల మాద్యమంలో విద్యా బోధనకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 వరకు పీజీ, బీఈడీలో 50 శాతం మార్కులతో రెండవ శ్రేణిలో ఉత్తీర్ణులై, టెట్‌ అర్హత సాధించిన వారు కామారెడ్డిలో …

Read More »

పక్షంరోజుల్లో లక్ష్యాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాఖల వారిగా ఇచ్చిన హరితహారం లక్ష్యాలను ఈనెల 15లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో హరితహారం లక్ష్యాలపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. అన్ని మండలాల్లో బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు పూర్తి …

Read More »

పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య

కామరెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »