Yearly Archives: 2023

మౌలిక వసతుల కల్పనలో బిఆర్‌ఎస్‌ విఫలం

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించడంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పాఠశాలలలో మౌలిక సదుపాయాలని కల్పించాలని నిరసిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లిటిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పర్లపల్లి రవీందర్‌, డాక్టర్‌ బాలు, జనపల …

Read More »

నేటి పంచాంగం

సోమవారం జూలై, 3, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : పౌర్ణమి సాయంత్రం 5.28 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మూల ఉదయం 11.39 వరకుయోగం : బ్రహ్మం సాయంత్రం 5.12 వరకుకరణం : విష్ఠి ఉదయం 6.33 వరకు తదుపరి బవ సాయంత్రం 5.28 వరకు ఆ తదుపరి బాలువ తెల్లవారుజాము 4.25 వరకువర్జ్యం : ఉదయం 10.06 – …

Read More »

ఇందూరు తిరుమలలో బలగం దర్శకులు వేణు

నిజామాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోపాల్‌ మండలం నర్సింగపల్లి ఇందూరు తిరుమల క్షేత్రాన్ని బలగం దర్శకులు ఎల్దండి వేణు దర్శించుకున్నారు. పౌర్ణమి సందర్భంగా ఇందూరు తిరుమలలో గర్భిణి స్త్రీలకు దివ్యౌషధాన్ని గత ఏడు సంవత్సరాలుగ ఉచితంగ పంపిణీ చేయడం గొప్ప దైవ కార్యమని వేణు అన్నారు. దివ్యౌషధం తీసుకున్న వారికి నార్మల్‌ డెలివరీ అవ్వడం పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం చూస్తుంటే స్వామి వారి …

Read More »

వానాకాలం సాగుకు ఇబ్బంది లేకుండా చర్యలు

హైదరాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా. రైతులకు ఇబ్బంది కలగకుండా వానాకాలం సాగుకు సాగునీటిని అందించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కృత నిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. అందుకు సంబంధించిన అంశంపై ఆదివారం సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారని మంత్రి వెల్లడిరచారు. సీఎం కేసిఆర్‌ సమీక్ష సమావేశం అనంతరం …

Read More »

వీధి వీధిలో వైదిక యజ్ఞము

నిజామాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని విశ్వవికాస్‌ పాఠశాలలో ఆదివారం ఆర్యసమాజము ఇందూరు ఆధ్వర్యంలో యజ్ఞము, సత్సంగ కార్యక్రమం నిర్వహించారు. స్వామి దయానంద సరస్వతి 200 సంవత్సరాల జయంతి ఉత్సవాల నేపథ్యంలో వీధి వీధిలో యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆచార్య వేదమిత్ర పేర్కొన్నారు. యజ్ఞము ద్వారా పర్యావరణము శుద్ధి అవుతుందని, వ్యాధుల బాధలు దూరమవుతాయని ఆర్యసమాజ అధ్యక్షులు సూర్యప్రకాశ్‌ వివరించారు. కార్యక్రమంలో ఆర్యసమాజ …

Read More »

సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సేవలు చిరస్మరనీయం

ఆర్మూర్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండల కేంద్రంలో సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు ఫౌండేషన్‌ సభ్యులు ప్రభాస్‌, దినేష్‌ చేస్తున్నారు. వీరి సేవలను గుర్తించి ప్రముఖులు అభినందిస్తున్నారు. తాజాగా టీ.ఎస్‌ .ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ కుమారుడు నిజామాబాద్‌ జిల్లా ఒలంపిక్‌ ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జెడ్‌పిటిసి బాజిరెడ్డి జగన్‌ సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ …

Read More »

గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కెవిఆర్‌ గార్డెన్‌ లో ఆదివారం గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు పట్టాలను గిరిజనులకు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేసిన ఘనత …

Read More »

సమాజ హితమే ధ్యేయంగా వైద్యులు పనిచేయాలి…

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఆర్కె కళాశాల, వాసవి క్లబ్‌,కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ల ఆధ్వర్యంలో ఉత్తమ డాక్టర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే కళాశాలల సీఈవో జైపాల్‌ రెడ్డి, ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, వాసవి క్లబ్‌ కామారెడ్డి అధ్యక్షుడు …

Read More »

జర్నలిస్ట్‌ కాలనీలో శ్రమదానం

ఆర్మూర్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ జర్నలిస్ట్‌ కాలనీలో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛకాలనీ సమైక్యకాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు రెండు గంటలు శ్రమదానం చేసి కాలనీలో రోడ్లను, మురుగు కాలువలను శుభ్రం చేశారు. చీపుర్లతో రోడ్లపై చెత్తాచెదారం ఊడ్చేశారు. పారలు పట్టుకొని పిచ్చిమొక్కలు, ముళ్ళ చెట్లను తొలగించారు. మురుగు కాలువలలో …

Read More »

ప్రశాంతంగా గ్రూప్‌-4 పరీక్ష

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా శనివారం జరిగిన గ్రూప్‌-4 పరీక్ష నిజామాబాద్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల, కాకతీయ జూనియర్‌ కాలేజ్‌ లలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ గూపన్‌ పల్లిలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »