నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పొందిన ఐ.ఎస్.ఓ సరిఫికేట్ కి గాను జిల్లా పాలనాధికారి , రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజీవ్ గాంధీ హన్మంతు బృందాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో ఇలానే నిజామాబాదు రెడ్ క్రాస్ సేవలు విస్తరించాలని రాష్ట్రంలోనే నిజామాబాదు కీర్తిని మరింత ప్రతిబింప చేయాలని కోరారు. తదుపరి అదనపు పాలనాధికారి చిత్రా మిశ్రని కూడా రెడ్ …
Read More »Yearly Archives: 2023
చేపూర్‌లో ఘనంగా పల్లె ప్రగతి దినోత్సవం
ఆర్మూర్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధికారులు, సిబ్బందితో పాటు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎంతో ఉత్సాహంతో ర్యాలీగా తరలివచ్చి పల్లె ప్రగతి దినోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామ పంచాయతీ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో గురువారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్న, ఇంచార్జి ఎంపిడిఓ …
Read More »అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జంగంపల్లి గ్రామంలో 6.45 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో 6 కోట్ల 45 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన …
Read More »ఓటరు జాబితా క్షుణ్ణంగా పరిశీలించాలి
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా రూపొందించిన ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ఏవైనా లోటుపాట్లను గుర్తిస్తే వెంటనే …
Read More »అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం గణితము-1బి, 2బి, జంతుశాస్త్రము, చరిత్ర ఉదయం మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. ఉదయం మొత్తం 6735మంది విద్యార్థులకు గాను 342 మంది విద్యార్థులు గైర్ హాజరు కాగా 6,393 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 6,085 మంది కి గాను 5,716 మంది హాజరు …
Read More »పల్లె పల్లెనా ప్రగతి వీచికలు
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ దూరదృష్టి నిర్ణయాలు, దార్శనిక పాలనతో అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ పల్లెలు ప్రగతి వీచికలు వెదజల్లాయి. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో సంతరించుకున్న హంగులు, మారిన రూపురేఖలతో సరికొత్త వెలుగులు విరజిమ్మాయి. స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని స్మరించుకుంటూ, ఆ స్పూర్తితో సాధించాల్సిన లక్ష్యాల వైపు మరింత ఉత్సాహంగా అడుగులు వేసేందుకు వీలుగా ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న …
Read More »డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక
డిచ్‌పల్లి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ మరియు 6వ సెమిస్టార్ కు చెందిన జియోగ్రఫీ సబ్జెక్టు పరీక్ష ఈ నెల 20 జరగాల్సి ఉండగా 27వ తేదీకీ, 2వ, 3వ,4వ సెమిస్టరు జియోగ్రఫీ పరీక్ష లు ఈ …
Read More »ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ
బాన్సువాడ, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని కొనాబాన్సువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు కొంతం వెంకటేశం, నాయకులు కిరణ్,తో కలిసి పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని అందులో భాగంగా విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేయడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని …
Read More »నేటి పంచాంగం
గురువారం, జూన్ 15, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, బహుళ పక్షంతిథి : ద్వాదశి ఉదయం 9.11 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : భరణి మధ్యాహ్నం 3.11 వరకుయోగం : సుకర్మ తెల్లవారుజామున 3.09 వరకుకరణం : తైతుల ఉదయం 9.11 వరకు తదుపరి గరజి రాత్రి 8.52 వరకువర్జ్యం : తెల్లవారుజామున 3.19 – 4.56దుర్ముహూర్తము : ఉదయం 9.49 – 10.41 …
Read More »డీఈఈ సెట్-2023 ఫలితాలు విడుదల
హైదరాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన డీఈఈ సెట్ -2023 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ మీడియం కాలేజీల వారీగా ఫలితాలను వెల్లడిరచారు. తెలుగు మీడియంలో 75.91 శాతం, ఇంగ్లీష్ మీడియంలో 84.72 శాతం, ఉర్దూ మీడియంలో 50.65 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి …
Read More »