Yearly Archives: 2023

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల రోజువారీ షెడ్యూల్‌

హైదరాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది …

Read More »

25 నుంచి గొర్రెల పంపిణీ

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25 నుంచి రెండో విడత గొర్రెల పంపిణిపై లబ్ధిదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం రెండో విడత గొర్రెల పంపిణీ పై పశుసంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. అవగాహన సదస్సులకు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యే …

Read More »

పుస్తకావిష్కరణ

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు సామాజిక ఆర్ధిక ముఖ చిత్రం పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో ప్రణాళిక శాఖ ముద్రించిన తెలంగాణా సామాజిక ఆర్ధిక ముఖ చిత్రం-2023 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పుస్తకం రాష్ట్ర సామాజిక ఆర్ధిక స్థితిగతులను తెలపడమే గాక …

Read More »

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

రెంజల్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జేపీఎస్‌ల రెగ్యులరైజేషన్‌ ఉద్యోగ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జేపీఎస్‌లు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలు నుంచి ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్న పంచాయతీ కార్యాదర్శుల కోరికను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రభుత్వానికి …

Read More »

కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ రావు సూచించారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఇంజినీరింగ్‌ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. ఈ …

Read More »

రాష్ట్రస్థాయిలో సత్తాచాటాలి

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్‌ జిల్లా స్థాయి కబడ్డీ, కోకో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడాకారులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. గెలుపు ఓటమి లను సమానంగా స్వీకరించాలని తెలిపారు. నేటి ఓటమి రేపటి …

Read More »

అన్‌లోడిరగ్‌ జాప్యంపై మంత్రి మందలింపు

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా అధికారులు అంకిత భావంతో పని చేయాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం తరలింపు విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. ప్రధానంగా రైస్‌ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను వెంటదివెంట అన్‌ లోడ్‌ చేసుకునేలా చూడాలని, ఏ …

Read More »

సిఎం కీలక నిర్ణయం

హైదరాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు. ఈ కమిటీలో …

Read More »

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

రెంజల్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు లచ్చావార్‌ నితిన్‌ తండ్రి గత పది రోజుల క్రితం మృతిచెందడంతో సోమవారం మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు అంతిరెడ్డి రాజరెడ్డి, జావిదోద్దీన్‌, ఎమ్‌ఎల్‌ రాజు, చిన్నోళ్ల రాకేష్‌, లోక కృష్ణ, కంఠం …

Read More »

చేపూర్‌లో ముగిసిన కంటి వెలుగు

ఆర్మూర్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని గోవింద్‌పెట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సబ్‌సెంటర్‌ చేపూర్‌ గ్రామంలో సోమవారం కంటి వెలుగు శిబిరం విజయవంతంగా ముగిసింది. మే 2వ తేదీ నుండి ప్రారంభమై మే 22 సోమవారం ముగిసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని మానస తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరంలో మొత్తం 1818 మందికి కంటి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »