Yearly Archives: 2023

పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

రెంజల్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా పారిశుధ్య కార్మికులను సోమవారం స్థానిక సర్పంచ్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మర్ల మషికారి రమేష్‌ కుమార్‌ శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులదేనని ఎండ, వానను సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా …

Read More »

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్‌ చేయాలి

రెంజల్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె నిర్వహిస్తున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి లను వెంటనే రెగ్యులర్‌ చేయాలని సిపిఐ ఎంఎల్‌ ప్రజాపంథా నాయకులు రాజేశ్వర్‌, నాగన్న అన్నారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సమ్మె సోమవారానికి మూడో రోజుకు చేరడంతో కళ్ళకు గంతలు కట్టుకొని …

Read More »

పోరాటాల ద్వారానే హక్కులు సాధ్యం

రెంజల్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హక్కులను సాధించాలంటే పోరాటాల ద్వారానే సాధ్యం అవుతాయని చికాగో కార్మికులు నిరూపించారని కార్మిక అమరుల స్ఫూర్తితో పోరాడి ఎన్నో చట్టాలను సాధించుకున్నామని సీపీఐఎంఎల్‌ ప్రజపంథా జిల్లా నాయకులు పార్వతి రాజేశ్వర్‌, పెద్దులు అన్నారు. మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో సోమవారం ప్రపంచ కార్మికుల దినం మేడేను పురస్కరించుకుని కార్మికుల జెండా ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటికైనా సమసమాజం ఏర్పడాలంటే …

Read More »

పంట నష్టం వివరాలు సేకరించాలి

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :వడగళ్ల వానతో పంట నష్టం జరిగిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో పంట నష్టం వివరాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పంట నష్టం వివరాలను సేకరించాలని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్లో …

Read More »

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిక్కనూర్‌ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో సోమవారం అకాల వర్షంతో దెబ్బతిన్న వరి పంటను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని సూచించారు. నష్టపోయిన రైతుల వివరాలు డాటా ఎంట్రీ చేయించాలని తెలిపారు.

Read More »

ప్రజావాణికి 49 ఫిర్యాదులు

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 49 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఆర్డీఓ చందర్‌, జెడ్పి …

Read More »

పనిలో మెళకువ, నైపుణ్యంతో మంచి భవిష్యత్తు

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :చేసే పనిలో మేలకులు, నైపుణ్యాలు నేర్చుకుంటే కార్మికులకు మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని బాలుర పాఠశాలలో సోమవారం జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఆరోగ్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. …

Read More »

ఘనంగా వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి…

ఎడపల్లి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యవైశ్య కుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరి మాత జయంతిని ఎడపల్లి మండలంలో ఆర్యవైశ్య కులసంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో ఆర్యవైశ్య సభ్యులు వాసవీ మాత చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎడపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్‌ …

Read More »

కమ్మర్‌పల్లిలో విఓఏల నిరసన

కమ్మర్‌పల్లి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం వద్ద ఏడవ రోజు వివోఎలు సమ్మెలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల వివోఎలు నోటికి చేయిపెట్టుకొని మౌనంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వివోఏల మండల అధ్యక్షుడు సుభాష్‌ మాట్లాడుతూ సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలని, 18 వేల వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని లేనిపక్షంలో సమ్మె ఉదృతం …

Read More »

విద్యుత్‌ షాక్‌తో గేదె మృతి

కమ్మర్‌పల్లి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ గ్రామంలో వడగళ్ల వర్షంతో పాటు ఈదురు గాలులు రావడంతో ఏలేటి రాజనర్సు రైతుకు సంబంధించిన గేదె మృత్యువాత పడిరది. కరెంటు తీగ తెగి గేదె మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందిందని రైతు ఏలేటి రాజనర్సు తెలిపారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »