Yearly Archives: 2023

మన్‌ కీ బాత్‌ వంద పుస్తకాలతో సమానం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన్‌ కీ బాత్‌ 100 ఎపిసోడ్స్‌ 100 పుస్తకాలతో సమానమని, ఈ 100 ఎపిసోడ్స్‌లో ప్రధానమంత్రి చెప్పిన విషయాలను పుస్తక రూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ అన్నారు. నాగారంలోని గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని వీక్షించారు. 100 ఎపిసోడ్స్‌లో ఎన్నో గొప్ప విషయాలను, …

Read More »

కానిస్టేబుల్‌ రాత పరీక్ష ప్రశాంతం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కానిస్టేబుల్స్‌ ఫైనల్‌ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఇంచార్జీ పోలీస్‌ కమీషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌ వెల్లడిరచారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ రిక్రూటుమెంట్‌ బోర్డు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్‌ ఫైనల్‌ రాత పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 1గంట వరకు నిర్వహించడం జరిగింది. నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేట్‌ వ్యాప్తంగా మొత్తం అభ్యర్థులు 5,285 మంది రాత పరీక్షకు …

Read More »

బోధన్‌లో కార్టన్‌ సెర్చ్‌

బోధన్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా, గురుగోవింద్‌ నగర్‌ కాలనీలో పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కార్టన్‌ సెర్చ్‌ నిర్వహించారు. కాలనీలోని ఇంటింటిని పరిశీలించి సరైన పత్రాలు ఉన్నాయో లేదో తనిఖీలు చేపట్టారు. అనంతరం కాలనీలో కమ్యునిటీ కాంటాక్ట్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఏసీపీ కిరణ్‌ కుమార్‌ హాజరై కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు. యువత చెడు …

Read More »

దళితరత్న అవార్డు గ్రహీతగా సిద్ధ సాయిలు

రెంజల్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన మాల మహానాడు మండల యువజన విభాగం అధ్యక్షుడు సిద్ధ సాయిలు చేసిన సేవలను గుర్తించి అంబేద్కర్‌ జయంతోత్సవాలను పురస్కరించుకుని శనివారం నిజామాబాద్‌ నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌ శేఖర్‌ చేతుల మీదుగా దళితరత్న అవార్డు అందుకున్నారు. గత దశాబ్ద కాలం నుండి మండలంలో దళితులపై జరుగుతున్న దాడులు, అన్యాయాలను నిర్భయంగా ఎదుర్కొంటున్న …

Read More »

నర్సరీ మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలి

బాన్సువాడ, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నర్సరీలో పెరుగుతున్న మొక్కలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులని జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శనివారం మండలంలోని బొర్లం గ్రామంలోని గ్రంథాలయాన్ని నర్సరీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలని హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ప్రతి ఇంటింటికీ …

Read More »

1,64,656 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయింది

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో యాసంగి 2022-23 సీజన్‌లో ఇప్పటివరకు 406 కేంద్రాల ద్వారా 20,239మంది రైతుల నుండి 1,64,656 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైస్‌ మిల్లులకు తరలించడం జరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. గ్రామ స్థాయిలో …

Read More »

గొర్రెల పంపిణీ పథకంపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అమలు తీరుపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండల ప్రత్యేక అధికారులు, వెటర్నరీ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెండవ విడత గొర్రెల పంపిణీ పథకం …

Read More »

పంటనష్టం జరిగితే విత్తనాల కంపెనీ నుంచి పరిహారం పొందవచ్చు

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విత్తనాల కారణంగా పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోతే రైతులు నష్టపరిహారం పొందే వీలుందని హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధా అన్నారు. బిక్కనూర్‌ రైతు వేదికలో శనివారం అగ్రీ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు చైతన్య సదస్సులో ఆమె రైతులను ఉద్దేశించి మాట్లాడారు. …

Read More »

అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీఓ నెం.58, 59 ద్వారా అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు ఈనెల 30 వ తేదీ నాటితో గడువు ముగియనుందని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు నిర్ణీత గడువులోగా మీ సేవా ద్వారా దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58, 59 ప్రకారం అభ్యంతరం …

Read More »

నెలరోజుల పాటు స్వచ్ఛ సర్వేక్షణ్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛ సర్వేక్షన్‌ జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డుల కోసం అన్ని గ్రామ పంచాయతీలు పోటీపడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం స్వచ్ఛ భారత్‌ మిషన్‌, రిలయన్స్‌ ఫౌండేషన్‌ స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్‌ 2023 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్‌ మాట్లాడారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »