Yearly Archives: 2023

మహిళలకు చక్కటి పొదుపు అవకాశం…

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, ఆర్మూర్‌ హెడ్‌ పోస్టాఫీస్‌, సబ్‌ పోస్టాఫీస్‌, గ్రామాలలోని బ్రాంచ్‌ పోస్టాఫీసులలో ఎక్కడైనా మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టీఫికెట్‌ – 2023 గురించి సంప్రదించి ఈ ఖాతాను ప్రారంభించవచ్చని శనివారం నిజామాబాద్‌, ఆర్మూర్‌ పోస్టల్‌ అదనపు ఎస్పీ యాపరు సురేఖ ఒక ప్రకటనలో కోరారు. భారత ప్రభుత్వం తపాలా శాఖ మహిళలకు మరియు ఆడపిల్లలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర …

Read More »

యాసంగి బియ్యం గోదాములకు తరలించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 30లోగా 2021-2022 యాసంగి బియ్యంను రైస్‌ మిల్లుల యజమానులు గోదాములకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం గోదాంల అధికారులు, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో మిల్లులలో నిల్వ ఉన్న ధాన్యంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. కాంట్రాక్టర్లు గోదాములలో ఖాళీ స్థలాలను …

Read More »

యువకుడికి రక్తదానం చేసిన అర్థశాస్త్ర అధ్యాపకుడు

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న యువకుడు చింతల లక్ష్మణ్‌కి ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభింలేదు. వారి బంధువులు ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్‌ చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్‌ కళాశాలలో అర్థశాస్త్ర …

Read More »

జిల్లా విద్యార్థిని ల్యాప్‌టాప్‌ గెలుచుకుంది..

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బాబు జగజీవన్‌ రామ్‌, డాక్టర్‌ అంబేద్కర్‌ జీవిత చరిత్ర మరియు వారు సాధించిన విజయాలు గురించి రాష్ట్ర స్థాయిలో వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. దానికి గాను నిజామాబాద్‌ జిల్లా విద్యార్థిని సునీత, 10 వ తరగతి, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహం, వర్ని ` ఉపన్యాసపోటీలో మొదటి బహుమతి సాధించింది. …

Read More »

అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని భావి తరాలకు అందించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని భావితరాలకు అందించాలని వక్తలు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించిన గొప్ప మేధావి అంబేడ్కర్‌ అని కొనియాడారు. జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం లో అంబేడ్కర్‌ 132వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. …

Read More »

ఘనంగా విశ్వరత్న అంబేద్కర్‌ జయంతి వేడుకలు

రెంజల్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచమేధావి,విశ్వరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌132వ జయంతి వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహానికి ఎంపీపీ రజినీకిషోర్‌,సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌, మాలమహనాడు జిల్లా ప్రధానకార్యదర్శి జక్కలి సంతోష్‌ పూలమాలలు వేసి నివాళి ఘటించారు. బొర్గం గ్రామంలో జడ్పీటీసీ విజయసంతోష్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రాంచందర్‌ …

Read More »

అంబేడ్కర్‌ జయంతి సందర్బంగా రక్తదానం

కామరెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ప్రాంగణంలో గల విశ్వరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ భీమ్‌ రావు అంబేద్కర్‌ జయంతి మహోత్సవం సందర్భంగా ఎన్జీవో ప్రతినిధులు నివాళులర్పించారు. ఈ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక వీటి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో ప్రతినిధులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎన్జీవో ఫౌండర్‌ …

Read More »

డాటా ఎంట్రీ సజావుగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో డాటా ఎంట్రీ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో గురువారం సహకార సంఘాల, ఐకెపి అధికారులతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. డాటా ఎంట్రీ సక్రమంగా చేయకుంటే ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల అధికారులపై చర్యలు …

Read More »

అంబేడ్కర్‌ జయంతికి హైదరాబాద్‌కు…

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం హైదరాబాదులో జరిగే 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు బస్సుల ద్వారా 300 మంది ప్రజలను తరలించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో విగ్రహావిష్కరణ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రాల …

Read More »

చిన్నారికి రక్తం అందించిన వ్యవసాయ విస్తరణ అధికారి

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న 16 నెలల చిన్నారికి బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్‌ చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన వ్యవసాయ విస్తరణ అధికారిగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »