కామారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని జై గౌడ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాంగోళ్ల మురళి గౌడ్ అన్నారు. తాడ్వాయి మండలంలోని ఎర్ర పహాడ్ గ్రామంలో సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 313 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మొదటగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. …
Read More »Yearly Archives: 2023
విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఫ్యామిలీ గ్లోరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలను కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. విద్యార్థులు తల్లితండ్రులకు బహుమతులు అందజేశారు. శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ స్వర్ణలత మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో కుటుంబం తల్లిదండ్రుల విలువలు మానవ సంబంధాలు ప్రాధాన్యతను తెలియజేయడమే ఈ ఫ్యామిలీ గ్లోరి కార్యక్రమం …
Read More »కలెక్టర్ చేతుల మీదుగా పులిహోర పంపిణీ
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయా సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చే వారి కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో పులిహోర వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా పులిహోర పంపిణీ చేశారు. వేసవి ఎండలు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో, ప్రజావాణి కార్యక్రమానికి ప్రతి సోమవారం సుదూర …
Read More »ప్రజావాణికి 78 ఫిర్యాదులు
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 78 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ చందర్, నిజామాబాదు …
Read More »నిబంధనల అమలుపై నిశిత పరిశీలన
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని రవి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే …
Read More »పది పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అడ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో కల్పించిన మౌలిక వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు.
Read More »పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
రెంజల్, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా జల్ద శ్రీనివాస్,లోల గంగాధర్,ఉపాధ్యక్షుడిగా దేవిదాస్, సహాయకార్యదర్శిగా స్వామి,కోశాధికారిగా మోహన్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలీల ఐక్యతకు కృషి చేస్తామని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వపరంగా పద్మశాలీల …
Read More »విద్యార్థులకు పండ్లు పంపిణీ
రెంజల్, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కళ్యాపూర్ గ్రామంలో ఆదివారం విద్యార్థులకు రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు జన్మదినాన్ని పురస్కరించుకొని పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. గ్రామ బిఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుండి బిఆర్‌ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ పార్టీ బలోపేతానికి …
Read More »సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి
నిజామాబాద్, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, శాసన మండలి సభ్యుడు …
Read More »మెడికల్ కళాశాలను సందర్శించిన జెడ్పి చైర్మన్, కలెక్టర్
నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను శనివారం సాయంత్రం జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. మెడికల్ కళాశాలలో అందుబాటులో ఉన్న వసతి, సదుపాయాలను పరిశీలించారు. కళాశాల నిర్వహణ తీరు గురించి ప్రిన్సిపాల్ ఇందిరను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్న …
Read More »