Yearly Archives: 2023

ఐఎన్‌టిఎస్‌ఓ పరీక్షల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య

కామారెడ్డి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాజాగా ప్రకటించిన ఐఎన్‌టిఎస్‌ఓ (ఇండియన్‌ నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఒలంపియాడ్‌) జాతీయ పరీక్ష ఫైనల్‌ ఫలితాలలో శ్రీ చైతన్య కామారెడ్డి బ్రాంచ్‌కు చెందిన 80 మంది విద్యార్థులు సత్తా చాటి వారి ప్రతిభను నిరూపించుకున్నారని కామారెడ్డి శ్రీ చైతన్య స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కే స్వర్ణలత అన్నారు. వీరిలో ఆరవ తరగతికి చెందిన ఏ కమల్‌ నాయుడుకు రెండవ బహుమతి, …

Read More »

లోక కళ్యాణం కోసమే…

రామారెడ్డి, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరిగిన శ్రీ సీతా రాముల వారి కళ్యాణ మహోత్సవానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, పాడి పంటలతో, శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లాలని స్వామి వారిని వేడుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి …

Read More »

ఘనంగా కుస్తీ పోటీలు

రెంజల్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కందకుర్తి గ్రామంలో గురువారం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని కుస్తీ పోటీలు ఘనంగా నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేందుకు మల్ల యోధులు దూర ప్రాంతాల నుండి అత్యధికంగా తరలివచ్చారు. సుమారు మూడు గంటల పాటు సాగిన పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించారు. చివరి కుస్తీ పోటీలో విజేతగా నిలిచిన మల్ల యోధుడికి వెండి కడియాన్ని అందజేశారు. అందజేసిన వారిలో …

Read More »

ఘనంగా శ్రీరామ నవమి ఉత్సవాలు

రెంజల్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంతో పాటు తాడ్‌ బిలోలి, నీలా క్యాంప్‌, నీలా, కందకుర్తి, దూపల్లి, కళ్యాపూర్‌, కూనేపల్లి, బాగేపల్లి, వీరన్నగుట్ట, బోర్గం గ్రామాలలో గురువారం శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయమే ఆలయాలను చేరుకొని వేద పండితులు మంత్రోచ్ఛలనాల మధ్య భక్తిశ్రద్ధలతో పూజల నిర్వహించారు. వేడుకల్లో సర్పంచులు రమేష్‌ కుమార్‌, సునీత నర్సయ్య, శనిగరం సాయిరెడ్డి, …

Read More »

రామ రాజ్యాన్ని తలపించేలా కేసిఆర్‌ పాలన

బాల్కొండ, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామ రాజ్యాన్ని తలపించేలా తెలంగాణలో కేసిఆర్‌ పాలన సాగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కేసిఆర్‌ సర్కార్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు,కుల వృత్తులు ఇలా అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. పేదలు, రైతులు అంటే పరితపించే కేసిఆర్‌ నాయకత్వం యావత్‌ భారతావనికి శ్రీరామ రక్ష లాంటిదన్నారు. రాముల …

Read More »

ఆలూర్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

ఆలూరు, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండల కేంద్రంలోని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చైత్ర శుద్ధ నవమి రోజున ఆలూర్‌ గ్రామంలో శ్రీరాముని యొక్క జననం నిర్వహిస్తారు. పురోహితులు మాట్లాడుతూ ప్రతి ఆలయంలో శ్రీరామ చంద్రుని కళ్యాణం జరిపితే ఆలూర్‌ రామాలయంలో శ్రీరాముని జననం జరుపుతారన్నారు. ఈ ఆలయానికి విశిష్టతగా పూర్వం నుండి శ్రీరామనవమి రోజున రాముడి యొక్క జననం నిర్వహించడం ప్రత్యేకత. …

Read More »

సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

నిజామాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 15 నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు విజయవంతంగా పూర్తయినట్లు జిల్లా ఇంటర్‌ విద్య అధికారి శ్రీ రఘురాజ్‌ తెలియజేశారు . జిల్లా కలెక్టర్‌ శ్రీ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్తు, పోస్టల్‌, పాఠశాల విద్యాశాఖల సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి …

Read More »

ఇంటర్మీడియట్‌ అధ్యాపకులకు ముఖ్య గమనిక

నిజామాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చ్‌ 31వ తేదీ శుక్రవారం నుండి నిజామాబాదులో ప్రారంభమవుతున్న మొదటి స్పెల్‌ ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాల మూల్యాంకన విధుల ఆర్డర్‌ కాపీలు వచ్చిన నిజామాబాద్‌ జిల్లా, కామారెడ్డి జిల్లాలోని ప్రతి అధ్యాపకుడు వెంటనే రిపోర్టు చేయాలని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ ఆదేశించారు. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, గణిత శాస్త్రము, పౌరశాస్త్రంకు సంబంధించిన మూల్యాంకనం శుక్రవారం ప్రారంభమవుతుందని …

Read More »

ఎల్‌వోసి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్ధరికి ఎల్‌వోసి చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. బిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన గాడి లక్ష్మికి 2 లక్షల 50 వేల రూపాయలు, మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామానికి చెందిన అంకాలపు మంజులకు రెండు లక్షల రూపాయల ఎల్‌వోసి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా …

Read More »

దక్కన్‌ ప్రాంతంపై మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరముంది

డిచ్‌పల్లి, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్కన్‌ ప్రాంతంపై మరింత పరిశోధనలు జరగవలసిన అవసరం ఉందని దక్కన్‌ చరిత్రలో ఇంకా ఎన్నో కొత్త అంశాలు వెలుగులోకి రావాలని ప్రసిద్ధ సాహితి వేత్త, మేడ్చల్‌ మల్కాజ్గిరి అడిషనల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. చరిత్ర కాంగ్రెస్‌ ముగింపు సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. దక్కన్‌ చరిత్రను పరిపూర్ణ రీతిలో రచించే క్రమంలో తెలంగాణ చరిత్ర …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »