Yearly Archives: 2023

ఉత్తమ అవార్డు గ్రామ సర్పంచులకు సన్మానం

రెంజల్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికైన దూపల్లి, బాగేపల్లి, కందకుర్తి, సాటాపూర్‌, నీలా గ్రామపంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, ఉపసర్పంచులు,ఆరోగ్య కార్యకర్తలు,ఆశావర్కర్లను శుక్రవారం ఘనంగా సన్మానించారు. 29 అంశాలపై గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ప్రజా ప్రతినిధులు, అధికారులను శాలువా పూలమాలలతో సత్కరించారు. సర్పంచులు శనిగరం సాయిరెడ్డి, పాముల సాయిలు, మీర్జా కలీంబేగ్‌, వికార్‌ పాషా, గౌరాజీ లలిత రాఘవేందర్‌, …

Read More »

ప్రభుత్వ పథకాల ఫలాలు అందరికి అందేలా చూడాలి

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలను అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో కంటి వెలుగు, జి. ఓ. నం.58, 59, 76, అర్బన్‌ హౌసింగ్‌, పోడు పట్టాలు, …

Read More »

అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి సీజన్‌ అయినందున అగ్ని ప్రమాద ఘటనలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఇవి మరింత సమర్ధవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా …

Read More »

ఏప్రిల్‌ 3 నుంచి సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ బీఈడీ కళాశాలలకు చెందిన మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్‌ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యార్థులు ఈ విషయం గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌లో సంప్రదించాలని కోరారు.

Read More »

కామారెడ్డి కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీపై కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి, ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌ సంఘాలు భగ్గుమన్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. పేపర్‌ లీకేజీకి కారకులైన కేటీఆర్‌ మంత్రి పదవి నుండి భర్తరఫ్‌ చేయాలని, అసమర్థ టీఎస్పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్‌లు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పట్టుబట్టాయి. అలాగే …

Read More »

కొండగట్టుకు పాదయాత్ర…

ఆర్మూర్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలం వాగ్గడ్డ హనుమాన్‌ మందిరం నుండి హనుమాన్‌ స్వాములు పాదయాత్రగా గురువారం బయలుదేరారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామం నందు వెలసిన శ్రీ మహాపుణ్యక్షేత్రం కొండగట్టు వరకు పాదయాత్రగా బయలుదేరి స్వామి అంజన్నకు మొక్కులు తీర్చుకుంటారు. ఇలా ప్రతి ఏటా అంజన్న హనుమాన్‌ స్వాములు పాదయాత్రకు బయలుదేరుతారు. భక్తులు మాట్లాడుతూ ప్రతి ఊరు ఊరు …

Read More »

నిజామాబాదుకు జాతీయ స్థాయిలో బంగారు పతకం

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా క్షయ నియంత్రణ విభాగం ద్వారా జిల్లాలో విస్తృతంగా క్షయ నిర్మూలన కార్యక్రమాల్ని నిర్వహించి టీబీని, నూతన క్షయ వ్యాధిగ్రస్తులను 60 శాతం వరకు నిర్మూలించడం ద్వారా నిజామాబాద్‌ జిల్లాకి జాతీయ స్థాయిలో బంగారు పతకం అవార్డు వరించింది. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ …

Read More »

మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉదృతం

హైదరాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఇప్పటికే జంతర్‌ మంతర్‌ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో, ఆయా మహిళా, సంఘాలతో సంఘాలతో భారత్‌ జాగృతి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించిన విషయం విధితమే. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో …

Read More »

పారిశుద్య కార్మికుల వేతనాలు అందజేయాలి

మాక్లూర్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడు నెలలుగా పారిశుద్ధ కార్మికులకు (గ్రామ పంచాయితీ సిబ్బందికి) వేతనాలు ఇవ్వడం లేదని, తక్షణమే వారికి వేతనాలు మంజూరు చేయాలని మాక్లూర్‌ మండల బిజెపి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు మాక్లూర్‌ మండల బిజెపీ శాఖ అధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు శివప్రసాద్‌ మాట్లాడుతూ దళితబంధు …

Read More »

పాఠశాలకు ప్రింటర్‌ బహుకరించిన పూర్వ విద్యార్థులు

నసురుల్లాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1996 ` 97, 10వ తరగతి చదివిన విద్యార్థులు 25 సంవత్సరాల సందర్భంగా సిల్వర్‌ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దూర్కి ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు ప్రింటర్‌ బహుకరించారు. పాఠశాల సౌకర్యార్థం ఈ ప్రింటర్‌ మరియు కలర్‌ జిరాక్స్‌ ఎంతగానో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »