Yearly Archives: 2023

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లక్కీ డ్రా పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డబల్‌ బెడ్‌ రూమ్‌ గృహాల లక్కీ డ్రాను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం జరిగే లక్కీ డ్రాకు లబ్ధిదారులు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి లక్కీ డ్రాను …

Read More »

రక్త మోడిన జాతీయ రహదారి

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. కంటైర్‌ను కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 44వ జాతీయ రహదారి చంద్రాయన్‌ పల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుండి నాగపూర్‌ వైపు వెళ్తున్న భారీ కంటైనర్‌ను వెనుక నుండి కారు ఢీకొన్నది. …

Read More »

నివేదికల ఆధారంగా చట్టంలో సంస్కరణలు తీసుకొస్తాం

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్‌ ఛైర్మన్‌ కె తిరుమల్‌ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, చైల్డ్‌ డెవలప్మెంట్‌ ఆఫీసర్స్‌, అంగన్వాడీ టీచర్స్‌, ప్రాంగణ ఎంఎస్‌డబ్ల్యు విద్యార్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చట్టం అమలుతీరును పరిశీలించేందుకు దోమకొండ ఐసీడీఎస్‌ ప్రాజెక్టును ఎంపిక చేసి విద్యార్థులతో ప్రత్యేకంగా సర్వే చేస్తున్నామన్నారు. …

Read More »

ఇంటర్‌ విద్యార్థుల కోసం టెలి మానస్‌ 14416 టోల్‌ ఫ్రీ నెంబరు

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణపై సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ సంబంధిత అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు సమకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే …

Read More »

ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఓ రవీందర్‌, జిల్లా అధికారులు రాజారాం, …

Read More »

ప్రజావాణికి 69 ఫిర్యాదులు

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 69 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, డీఆర్డీఓ చందర్‌, నిజామాబాదు ఆర్దీఓ …

Read More »

ఇంటర్‌ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై సోమవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్‌ బోర్డు అధికారులతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ …

Read More »

అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

బాన్సువాడ, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కె డిగ్రీ కళాశాలలో ఆంగ్లం బోధనలో అతిథి అధ్యాపకులుగా పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఇందూరు గంగాధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పిజిలో 55 శాతం మార్కులు కలిగి ఉండాలని, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులు 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. అలాగే నెట్‌, సెట్‌, పిహెచ్‌డి …

Read More »

గెస్ట్‌ లెక్చరర్‌ కొరకు దరఖాస్తు చేసుకోండి

మోర్తాడ్‌ మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని మోర్తాడ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు కామర్స్‌ సబ్జెక్టులో బోధించుటకు గెస్ట్‌ లెక్చరర్‌ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పెద్దన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులు కలిగి ఉండి నెట్‌, సెట్‌, పిహెచ్‌డి కలిగి బోధన అనుభవం కలవారికి ప్రాధాన్యత కలదని …

Read More »

సుంకెట్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

మోర్తాడ్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని సుంకెట్‌ గ్రామంలో ఆదివారం 15 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను మోర్తాడ్‌ ఎంపీపీ శ్రీనివాస్‌, జడ్పిటిసి రవి, బిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఏలియా స్థానిక సర్పంచ్‌ కడారి శ్రీనివాసులు టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుంకెట్‌ గ్రామంలో అంతర్గత రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »