Yearly Archives: 2023

నాగ్‌పూర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంప్‌కి మంజీర విద్యార్థులు

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీర డిగ్రీ కళాశాల విద్యార్థులు నాగలక్ష్మి, దశరథ్‌ నాయక్‌ ఈనెల 26వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు నాగపూర్‌లో జరిగే ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపునకు తెలంగాణ యూనివర్సిటీ తరపున ఎంపికైనట్టు కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్‌ గురువేందర్‌ రెడ్డి, ప్రిన్సిపల్‌ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి నాగపూర్‌ క్యాంపులో ఉత్తమ ప్రతిభ …

Read More »

మెడికల్‌ కళాశాలలో కలకలం..
ఉరివేసుకొని మెడికో విద్యార్థి ఆత్మహత్య

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాకతీయ వైద్య కళాశాలలో పీజీ విద్యార్ధి ప్రీతి ఆత్మహత్య యత్నం కలవర పెడుతున్న విషయం మరవక ముందే నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో మరో మెడికో ఆత్మహత్య చేసుకోవడం కలకలం లేపింది. ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థి హాస్టల్‌ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తల్లిదండ్రులకు తీరని బాధను మిగిల్చింది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ …

Read More »

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లెల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని టిఎస్‌ ఆర్టిసి చైర్మన్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వము గిరిజన సంక్షేమ శాఖ సిరికొండ మండలంలోని చీమన్‌ పల్లి టు జంగ్యాల్‌ తాండ నుండి 3 కి.మీల వరకు బి.టి. రోడ్డు నిర్మాణము రూ. 2.70 కోట్లు రూపాయలతో నిర్మించనున్న పనులకు శనివారం టిఎస్‌ ఆర్టిసి …

Read More »

పి.ఆర్‌.సి. కమిటీని వెంటనే నియమించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేతన సవరణ కాల పరిమితి ముగిసినందున వెంటనే పిఆర్సీ కమిటీ నియమించాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. శనివారం హైదరాబాదులోని సంఘం కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని, ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ లోప భూయిష్టంగా …

Read More »

జాబ్‌మేళాలో 56 మంది ఎంపిక

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల మంజీర కళాశాలలో శనివారం నిర్వహించిన జాబ్‌ మేళా కు అనూహ్య స్పందన లభించింది. టాస్క్‌ సహకారం తో ప్రముఖ ఎంఎస్‌ఎన్‌ లాబోరేటిస్‌ కార్పొరేట్‌ కంపెనీ ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్‌, సెక్రటరీ గురువేందర్‌ రెడ్డి మాట్లాడుతూ బిఎస్సి, బీకాం, బీఏ ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోలకోసమే డ్రైవ్‌ నిర్వహించినట్లు …

Read More »

జి 20 జాతీయ సదస్సులో పాల్గొన్న గవర్నర్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం జరిగిన ‘ఇండియాస్‌’ జి 20 ప్రెసిడెన్సీ ఆపర్చినిటీస్‌ అండ్‌ చాలెంజెస్‌ ఫర్‌ ఇండియా యాస్‌ ది గ్లోబల్‌ లీడర్‌’’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ మరియు పాండిచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డా. తమిళిసై సౌందర రాజన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మొదట ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ …

Read More »

బీడీ కార్మికులకు కరువు భత్యం అమలు చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికులందరికీ కరువు భత్యం (వీడీఏ) అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) ఆధ్వర్యంలో ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యు) రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గల బీడీ పరిశ్రమలు పనిచేస్తున్న …

Read More »

ఆదర్శ మునిసిపాలిటిగా తీర్చిదిద్దాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ 2023-24 బడ్జెట్‌ సమావేశం శనివారం పట్టణంలోని కళాభారతిలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి బడ్జెట్‌ ను వినియోగించాలని తెలిపారు. మున్సిపల్‌ …

Read More »

డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సి) ద్వారా ఈ నెల 26 ఆదివారం జరుగనున్న డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. రాత పరీక్ష కోసం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో 20 సెంటర్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 …

Read More »

బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి కంకణబద్దుడనై ఉంటా

బాల్కొండ, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలంలో శుక్రవారం పలు అభివృద్ది పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులతో, గ్రామస్థులు డప్పు చప్పుళ్లతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. చిన్నా పెద్దా అందర్నీ పలకరిస్తూ మంత్రి ముందుకు సాగారు. పురాతన దేవాలయం శ్రీ లక్ష్మి నరసింహ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »