Yearly Archives: 2023

పరీక్ష తేదీలు మార్పు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ మొదటి మరియు మూడవ సెమిస్టర్‌ (ఎంసిఎ, ఎంబిఎ, ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి), 5 వ సెమిస్టర్‌, ఎల్‌ఎల్‌బి, ఐఎంబిఎ 7వ మరియు 9వ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుండి ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా వేశామని ఈ పరీక్షలు మార్చ్‌ 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ …

Read More »

మామిడి ఆకుపై శివాజీ చిత్రం

బాన్సువాడ, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని పోచారం తండా గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు బానోత్‌ సరి చంద్‌ శివాజీ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుతూ మామిడి ఆకుపై శివాజీ ఆకారాన్ని చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నారు. గతంలోనూ సుద్ధ ముక్కపై స్వతంత్ర సమరయోధుల ప్రతిమలను చెక్కడంతో తాండావాసులు గ్రామస్తులు అయనను అభినందించారు.

Read More »

ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సన్మానించిన దళిత హక్కుల సంఘం నేతలు

బాన్సువాడ, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రం (దవాఖాన) జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినందున శనివారం ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌కు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షులు అయ్యల సంతోష్‌ మాట్లాడుతూ తల్లి పాలను ప్రోత్సహిస్తున్న …

Read More »

ఫిబ్రవరి 18న తిరుమలలో క్షేత్రపాలకుడికి అభిషేకం

తిరుమలలోని గోగర్భం సమీపంలో వెలసిన రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పర్వదినం ఘనంగా నిర్వహిస్తారు. రుద్రుడు తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సుగంధద్రవ్యాలతో క్షేత్రపాలకునికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టరు (రెగ్యులర్‌) పరీక్షలో 10,425 మంది విద్యార్థులకు గాను 9564 మంది హాజరయ్యారని, 861 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని సివోఈ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టరు తెలుగు సబ్జెక్ట్‌ పరీక్షలో ఇద్దరు, అరబిక్‌ సబ్జెక్ట్‌లో ఒకరు భీంగల్‌ సాయి సిద్దార్థ డిగ్రీ కళాశాల …

Read More »

ఎడపల్లిలో కొనసాగుతున్న ఆయుష్మాన్‌ భారత్‌ నమోదు

ఎడపల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుతో దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్యసేవలు పొందవచ్చని ఆరోగ్య మిత్ర విద్యావతి తెలిపారు. శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు నమోదు కార్యక్రమంలో ప్రజలకు ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు నమోదు వల్ల చేకూరే ప్రయోజనాలు తెలియజేస్తూ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆరోగ్యశ్రీ కార్డు లేనివారు ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, …

Read More »

ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్‌ వాయి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా గత మూడు రోజులుగా మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలయ అర్చకులు రాజమౌళి, శంకర్‌, గంగన్న అధ్వర్యంలో మొదటి రోజు పల్లకి సేవ, అగ్నిహోమం, పూర్ణాహుతి శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, ఒడిబియ్యం, పూర్ణాహుతి, రెండవ రోజు స్వామివారికి విశేషా అభిషేకాలు స్వామివారిని గ్రామములో రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని …

Read More »

కెసిఆర్‌ జన్మదినం సందర్బంగా రక్తదానం శిబిరం

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ తెలంగాణ సేవాదళ్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తల సేమియా సికిల్‌ సెల్‌ సొసైటీ హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ డెవలప్మెంట్‌ చైర్మన్‌ ఐ.వి.ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి …

Read More »

ఎర్రజొన్న కొనుగోళ్లలో బైబ్యాక్‌ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఆయా మండలాల్లో రైతులు సాగు చేసిన ఎర్రజొన్న పంటను బైబ్యాక్‌ ఒప్పందానికి అనుగుణంగా సీడ్‌ వ్యాపారులు కొనుగోలు చేసేలా క్షేత్ర స్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి …

Read More »

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ స్థాయిలో ఆరోగ్య పోషణ రోజును ప్రతినెల మొదటి వారంలో జరిగే విధంగా ఐసిడిఎస్‌ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం పోషణ అభియాన్‌ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. మార్చి నెలలో 15 రోజులపాటు పోషణ పక్షోత్సవాలు నిర్వహించాలని తెలిపారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »