కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజ సేవలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని పి ఆర్ టి యు భవనంలో పి ఆర్ టి ఓ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రక్తదానం చేసి …
Read More »Yearly Archives: 2023
కంటి వెలుగు శిబిరాలను సక్రమంగా నిర్వహించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు శిబిరాలను నిర్దిష్ట ప్రణాళికకు అనుగుణంగా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. గురువారం ఆయన వర్ని మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. శిబిరానికి తరలివచ్చిన వారికి నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. శిబిరం వద్ద అందుబాటులో ఉంచిన సదుపాయాలు గమనించి సంతృప్తి …
Read More »బోర్‌వెల్ డీ, వ్యక్తి మృతి
మాక్లూర్, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం బొంకన్ పల్లి గ్రామంలో బోర్‌వెల్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బొంకన్ పల్లి గ్రామవాసి సుధాకర్ తన నూతన ఇల్లు నిర్మాణంలో భాగంగా నీటి అవసర నిమిత్తం బోరు వేసే దశలో డ్రైవర్ తప్పిదంతో రివర్స్ చేసే సమయంలో వేగంగా రావడంతో …
Read More »బైక్‌ను డీకొన్న లారీ… యువకుడికి తీవ్ర గాయాలు
ఎడపల్లి, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామ సమీపంలో గల అశోక్ సాగర్ దర్గా వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని 108 ద్వారా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి మండలంలోని ఎంఎస్సి ఫారం గ్రామానికి చెందిన అన్నారం రాజు అనే యువకుడు …
Read More »28 లోగా సీఎంఆర్ బియ్యం అందజేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 28 లోగా రైస్ మిల్లుల యజమానులు సీఎంఆర్ బియ్యంను అందజేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్లతో ఖరీఫ్ (వానకాలం) 2021-22 సీజన్‌కు చెందిన సిఎంఆర్ బియ్యం సరఫరా గురించి రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం మిల్లింగ్ లక్ష్యాలను పూర్తి …
Read More »మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్
హైదరాబాద్, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు బుధవారం అసెంబ్లీలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని తన ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి మంత్రి వేముల శుభాకాంక్షలు తెలిపారు. Blog heading and website banner of laptop with female typing hands, copy space in …
Read More »బాలికల భవితకు భరోసా సుకన్య పథకం..
బాన్సువాడ, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని తపాలా శాఖ కార్యాలయ ఆవరణలో సబ్ డివిజనల్ తపాలా శాఖ ఇన్స్‌పెక్టర్ వేణు సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా శాఖ ఆధ్వర్యంలో భారత స్వతంత్ర సమరయోధుల చిత్రాలతో …
Read More »విసికి కృతజ్ఞతలు
కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దాచేపల్లి రవీందర్ గుప్తాను బుధవారం టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులను కల్పించినందుకు, ఈ విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ జువాలజీ కోర్సును ప్రారంభించినందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ దక్షిణ ప్రాంగణంలో విద్యార్థులకు అవసరమైన …
Read More »పోడు భూముల ప్రక్రియ సత్వరమే పూర్తి చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూములకు సంబంధించిన ప్రక్రియను ఈ నెల 15 వ తేదీ లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా, నిర్దేశిత గడువుకంటే ముందే అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే అర్హులైన వారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని …
Read More »అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే నోటీసులు
కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లో అనుమతి లేకుండా గృహాల నిర్మాణం చేపడితే వారికి పంచాయతీ కార్యదర్శులు నోటీసులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం లేఅవుట్ రూల్స్, బిల్డింగ్ రెగ్యులేషన్స్ ఇతర కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీవో లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై …
Read More »