Yearly Archives: 2023

ప్రతి ఇంటిలో ప్రతి ముఖంలో సంతోషమే ప్రభుత్వ లక్ష్యం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఇంటిలో ప్రతి ముఖంలో సంతోషమే ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం ఆయన కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణేష్‌ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్‌ నగరానికి చెందిన 198లబ్దిదారులకు 298 కల్యాణ లక్ష్మీ చెక్కులకు గాను రు.1,98,22,968 అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమం-ప్రతి ఒక్కరి ముఖంలో …

Read More »

ఎమ్మెల్యేపై దూషణలు ఖండించిన యూత్‌ నాయకులు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే పియుసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డి పై సోషల్‌ మీడియాలో వ్యక్తిగతంగా అసభ్య కరమైన పోస్టులు పెట్టిన బిజెపి పార్టీకి చెందిన మల్లెల శ్రీనివాస్‌ రెడ్డి పైన ఆర్మూర్‌ సిఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యువజన కమిటీ నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం చాలా బాధాకరమని, వారు …

Read More »

అగ్నిపథ్‌కు ఎంపికైన డిగ్రీ విద్యార్థి

బాన్సువాడ, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఎస్‌ఆర్‌యన్‌కే డిగ్రీ కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి దాసరి వినోద్‌ కుమార్‌ అగ్ని వీరుడుగా ఎంపికైనందుకు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గంగాధర్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అగ్నిపత్‌ ఆర్మీ స్పోల్స్‌ భాగంగా కళాశాల నుండి విద్యార్థి ఎంపిక అవడం ఎంతో అభినందనీయమన్నారు. చదువుతోపాటు దేశ రక్షణలో యువత …

Read More »

కంటి వెలుగు శిబిరాలను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాలను నివారించాలని కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మంగళవారం సందర్శించారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన శిబిరంతో పాటు, యానాంపల్లి తండా మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను తనిఖీ చేశారు. శిబిరాల నిర్వహణ తీరును నిశితంగా …

Read More »

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీడీవో

బాన్సువాడ, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బోర్లమ్‌ క్యాంపులో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అందత్వ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాల ద్వారా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు కళ్లద్దాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి అన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటరామిరెడ్డి, స్థానిక సర్పంచ్‌, క్యాంప్‌ …

Read More »

వృద్ధాశ్రమ భవనం ప్రారంభించిన ఆర్టీసీ చైర్మన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్పల్లి మండలం రాంపూర్‌ గ్రామంలో అన్ని హంగులతో రూ. 50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వృద్ధాశ్రమం భవనానికి మంగళవారం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రారంభించారు. వృద్ధాశ్రమం ఆవరణలో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ పార్క్‌ పనులకు శంకుస్థాపన చేశారు. వృద్ధాశ్రమంలోని వివిధ …

Read More »

ఘనంగా గంగామాత ఆలయ వార్షికోత్సవం

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సువిశాలంగా గత 21 సంవత్సరాల క్రితం గంగపుత్ర కుల పెద్దలు గంగామాత ఆలయాన్ని నిర్మించుకుని శ్రీ గంగామాత విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నారు. మూడు రోజుల పాటు శ్రీ గంగామాత ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం మాదిరిగా 21 వ వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం కూడా మూడు రోజుల …

Read More »

స్టడీ మెటీరియల్‌ విడుదల

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఎస్‌సి పబ్లిక్‌ పరీక్షలు -2023 కు సంబందించిన కొత్త మోడల్‌ పేపర్‌ ప్రకారం స్టడీ మెటీరియల్‌ కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు అందచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిఇవో రాజు, ఏసిజిఇ నీలం లింగం, డిసిఇబి సెకెట్రరీ బలరాం, శ్రీకాంత్‌, సాందీపని కాలేజీ యాజమాన్య సభ్యులు …

Read More »

మెడికల్‌ షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొగాకు నియంత్రణ పై జూనియర్‌ కళాశాలల’ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో పొగాకు, డ్రగ్స్‌ నియంత్రణ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. పొగ తాగడం వల్ల విద్యార్థులకు కలిగే అనర్థాలను వివరించాలని …

Read More »

పద్మశాలి యువజన సంఘం ఏకగ్రీవ ఎన్నిక

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ పద్మశాలి యువజన సంఘం నూతన కమిటీ 2023-26 కొరకు గత నెల జనవరి 31 నాడు నామినేషన్లు స్వీకరించడం జరిగింది. దాదాపు 23 నామినేషన్లు వస్తే పద్మశాలి యువజన సంఘ సభ్యులు అందరూ కూర్చొని మాట్లాడుకొని సహకరించి యువజన సంఘ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీలో గౌరవ అధ్యక్షుడిగా ఐరేని సందీప్‌ కుమార్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చెలిమల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »