రెంజల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల పెన్నిధి ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చే బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సర్పంచ్ రమేష్ కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన జబ్బర్ ఖాన్‌కు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన రూ.36 వేలు, బి. సత్తెవ్వకు రూ.14 వేలు, మహ్మద్ ఉస్మాన్ కు రూ.11 వేల చెక్కును అందజేశారు. అనారోగ్యానికి గురైన …
Read More »Yearly Archives: 2023
ఉత్తమ అధికారుల వివరాలు అందజేయాలి
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :ఉత్తమ అధికారులను ఎంపిక చేసి శాఖల వారీగా వారి పేర్లను పర్యవేక్షకుడు సాయి భుజంగరావుకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజా ప్రతినిధులకు ఆహ్వాన పత్రికలు అందే విధంగా అధికారులు చూడాలని …
Read More »ప్రజావాణికి 79 ఫిర్యాదులు
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 79 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు డీఆర్డీఓ …
Read More »తెలంగాణ పదానికి మారుపేరు ‘టీఎన్‌జీఓ’ లు
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ పదానికి టీఎన్‌జీఓలు మారుపేరుగా నిలుస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులను తాము ఎన్నడు కూడా వేరు చేసి చూడలేదని, వారితో ప్రభుత్వానికి ఉన్నది పేగు బంధం అని మంత్రి స్పష్టం చేశారు. టీఎన్‌జీఓల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్ లను …
Read More »నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు…
బీర్కూర్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127 వ జయంతి వేడుకలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏఐఎస్‌బి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతు స్వాతంత్య్ర సమరయోధులు దేశ భక్తులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటాన్ని విద్యార్థులకు, యువతకు తెలియజేస్తూ మరింత ముందుకు వెళతామన్నారు. …
Read More »హిందువుల ఉపవాసాలపై పరిశోధనలు జరుగుతున్నాయి
ఎడపల్లి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతీ ఒకరికి ఆదర్శంగా నిలుస్తున్నాయని హిందూ సంస్కృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా చర్చించుకొంటున్నారని, ప్రపంచంలోని పెద్ద పెద్ద మేధావులందరూ హిందూ సంస్కృతిపై అవగాహన పెంచుకుంటున్నారని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి అన్నారు. ఆదివారం ఎడపల్లి మండలంలోని మంగల్పహాడ్ గ్రామంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసారు. ఈ సందర్భంగా హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి …
Read More »అభివృద్ధి పనుల్లో అలసత్వం తగదు
ఆర్మూర్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతీ బుధవారం స్వచ్చ ఆర్మూర్ కార్యాక్రమాన్ని విధిగా నిర్వహించాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బంజారహిల్స్ రోడ్ నెం.12 లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఆదివారం ఆర్మూర్ మునిసిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానంగా కంటి వెలుగు కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షా …
Read More »ఏ.ఈ.ఈ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఆదివారం జరుగనున్న రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 10 నుండి 12.30 గంటల వరకు జరిగే పేపర్-1 పరీక్షకు సంబంధించి అభ్యర్థులను ఉదయం 8.30 నుండి 9.45 గంటల వరకు లోనికి …
Read More »మహిళల సాధికారతతోనే దేశ ప్రగతి నిర్మాణం
నిజామాబాద్, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం మహిళల సాధికారతలో మరో మైలురాయిగా స్థిరపడుతుందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పి.శ్రీసుధ తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టులలో మహిళ న్యాయమూర్తుల సంఖ్య పెరుగుదల జెండర్ వివక్షకు విరుగుడుగా అభివర్ణించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పొలీస్ పేరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన మహిళ సాధికారత సదస్సులో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేశారు. …
Read More »కంటి వెలుగు శిబిరాల్లో నాణ్యమైన సేవలందించాలి
నిజామాబాద్, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాల నివారణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల ద్వారా ప్రజలకు సంతృప్తికర స్థాయిలో నాణ్యమైన సేవలందేలా పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి సూచించారు. జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం పై సీ.ఎస్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »