Yearly Archives: 2023

కామారెడ్డి మహిళలకు సదవకాశం

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ గంగా సాయి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నట్లు గంగాసాయి ఫౌండేషన్‌ నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలో శ్రీ గంగా సాయి ఫౌండేషన్‌ ద్వారా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, జనరల్‌, ఇలా అన్ని వర్గాల వారికి టైలరింగ్‌, మగ్గం వర్క్‌, బ్యూటిషన్‌, మెహందీ, కంప్యూటర్‌ తదితర వాటిపై ఉచిత …

Read More »

సెవెన్‌ హాట్స్‌, ఫోర్‌ సైట్‌ ఎన్జీవో ఆధ్వర్యంలో సావిత్రిబాయి జయంతి వేడుకలు

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల షెడ్యూల్‌ కులాల బాలికల వసతి గృహంలో సెవెన్‌ హార్డ్స్‌ మరియు ఫోర్‌ సైట్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సేవకురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్జీవో ప్రతినిధులు మాట్లాడుతూ మహిళల విద్య, అభ్యున్నతి కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారన్నారు. …

Read More »

కల్కి భగవాన్‌ ఆలయంలో అన్నదానం

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ పరంజ్యోతి కల్కి భగవాన్‌ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాతలుగా తిరునహరి సురేష్‌ బాబు, రమాదేవి దంపతులు వారి కుమారులు వెంకట సాయి నేత్ర, నికితలు అన్నదాతలుగా ముందుకు వచ్చారు. వారికి శ్రీ పరంజ్యోతి కల్కి మానవ సేవ సమితి తరపున కృతజ్ఞతలు తెలిపారు. గత మూడు సంవత్సరాల నుండి నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం …

Read More »

బాధ్యతలు చేపట్టిన వైద్యాధికారులకు సన్మానం

రెంజల్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులుగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ వినయ్‌ కుమార్‌, డాక్టర్‌ సహిస్థాపిర్దోస్‌లను సిబ్బంది శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణాధికారులు శ్రావణ్‌ కుమార్‌, కరిపే రవీందర్‌, మాలంబి, రాణి, ఆరోగ్య కార్యకర్తలు సిబ్బంది ఉన్నారు.

Read More »

విద్యార్థుల ప్రతిభ వెలికితీతకే బోధనోపకరణాల మేళ

రెంజల్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యాబోధనను సమర్థవంతంగా నిర్వహించుటకు అన్ని స్థాయిలలోని విద్యార్థులల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే బోధనోపకరణాల మేళ ఉపయోగపడతాయని ఎంపీపీ రజిని కిషోర్‌ అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్‌ భవిత దివ్యాంగుల పాఠశాలలో బోధనోపకరణమేలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు వారి ప్రతిభతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కిలకించారు.అనంతరం వారు మాట్లాడుతూ. విద్యార్థుల్లో దాగి ఉన్న …

Read More »

‘కంటివెలుగు’ విజయవంతం చేయండి

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం జిల్లా కలెక్టర్లు, అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మొదటి విడతలో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు.54 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ …

Read More »

జనవరి 5న తుది జాబితా విడుదల చేస్తాం

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 5న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తామని ఎన్నికల అబ్జర్వర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. 1 నుంచి 8 ఫార్మాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో83.19 శాతం ఓటర్లది ఆధార అనుసంధానం చేశారని పేర్కొన్నారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకల నిర్వహణపై వివరాలను …

Read More »

జాతీయ రహదారి పక్కన పచ్చదనం పెంపొందించాలి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మీదుగా వెళ్తున్న 44 వ నెంబర్‌ జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చదనం పెంపొందించేలా పక్కా ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా సరిహద్దు ప్రాంతమైన చంద్రాయన్పల్లి నుండి డిచ్‌ పల్లి వరకు హైవేకు ఆనుకుని నాటిన మొక్కలను, వాటి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. అక్కడక్కడా …

Read More »

108 సేవలకు గుర్తింపుగా కుర్చీలు, ఫ్యాన్లు అందజేత

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జిల్లా కేంద్రంలోని 108 అంబులెన్స్‌ చేస్తున్న సేవలు గుర్తించి బస్సా సాయిలు వారి తండ్రి బాస్స బాలయ్య జ్ఞాపకార్థం తన వంతుగా ఐదు కుర్చీలు ఒక ఫ్యాను అందజేశారు. 108 సేవలు మరువలేనివని, పేద, ధనిక అనే తేడా లేకుండా ఫోన్‌ రావడంతోనే వారు చేస్తున్న పనిని చూసి ఆసక్తికరమైన కొన్ని సన్నివేశాలు తాను చూడడం …

Read More »

గంజాయిపై ఉక్కుపాదం

వేల్పూర్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చని జీవితాలను విచ్ఛిన్నం చేస్తూ ఆరోగ్యకర సమాజాన్ని పాడు చేస్తున్న గంజాయి మహమ్మారిని అంతమొందించాలని నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అదేశించారు. మంగళవారం నిజామాబాద్‌ సి.పి నాగరాజు, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి పలువురు పోలీసు అధికారులు మంత్రిని వేల్పూర్‌ క్యాంపు కార్యాలయంలో కలిసి నూతన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »